Rajamouli : అన్నదమ్ములు రాజమౌళికి SS.. కీరవాణికి MM.. అని ఎందుకు ఉంటాయో మీకు తెలుసా…?
Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి – ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి వరుసకి సోదరులవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిది చాలా పెద్ద కుటుంబం. దాదాపు వీరి ఫ్యామిలీ మొత్తం గత కొన్నేళ్ళుగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అంతేకాదు అందరు వివిధ విభాగాలలో మంచి స్థాయిలో ఉన్నవారే. వీరిద్దరు ఒకే ఫ్యామిలీకి చెందిన వారైనప్పటికి వేరే వేరే ఇంటిపేర్లు..వెండితేర మీద ఎందుకున్నాయి అని చాలా కన్‌ఫ్యూజన్ చాలామందిలో కలుగుతుంది. దానికి కారణం చాలా తక్కువ మందికే తెలుసు. ఆ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందాము.
దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పేరుకు ముందు కె.వి. అని ఉంటుంది. వాళ్ల ఇంటి పేరు కోడూరి. వీరి కుటుంబంలో మొదటి సోదరుడు కోడూరి రామారావు. ఆయన తర్వాత కోడూరి శివశక్తి దత్తా, ఆయన తర్వాత కోడూరి కాశి. కోడూరి శివశక్తి దత్తా కీరవాణికి తండ్రిగారు అన్న విషయం తెలిసిందే. ఈయన చంద్రహాస్ అనే సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. కీరవాణికి మరో సోదరుడు ఉన్నారు. ఆయనే కళ్యాణ్ మాలిక్. కోడూరి కాశీ కీరవాణిని సంగీత దర్శకుడు చక్రికి పరిచయం చేశారు.
Rajamouli : బాహుబలికి నేపథ్య సంగీతం అందించారు.
ఆ రకంగా కీరవాణికి మొదటి అవకాశం దక్కింది. కళ్యాణ్ మాలిక్ కూడా ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఐతే, ఊహలు గుసగుసలాడే సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడంతో పాటు బాహుబలికి నేపథ్య సంగీతం అందించారు. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఆ తర్వాత సోదరుడు కోడూరి విజయేంద్రప్రసాద్. కోడూరి రామకృష్ణ ఈ ఫ్యామిలీలో చివరి సోదరుడు. వీళ్ళందరికీ ఒక సోదరి ఉన్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. ఆయన మెర్సల్ (తెలుగులో అదిరింది), భజరంగీ భాయిజాన్, మణికర్ణిక, తలైవి సినిమాలకు కథను అందించారు. అంతేకాదు రాజమౌళి దర్శకత్వం వహించిన చాలా సినిమాలకి కథ ఆయన ఇచ్చిందే. ఇక శ్రీవల్లీ, రాజన్న సినిమాలకి దర్శకత్వం వహించాడు.
Rajamouli : రాజమౌళి పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి.
ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి కథ అందించారు. ఇక రాజమౌళి పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. ఎస్ ఎస్ అంటే అర్థం ఇదే. అలాగే కీరవాణి పూర్తి పేరు మరకతమణి కీరవాణి. ఆయన పేరులో ఉండే ఎం ఎం అక్షరాల వెనకున్న అర్థం మరకతమణి. వాళ్ళ కుటుంబంలో ఇంటిపేరు ఉపయోగించింది ఒక్క కళ్యాణ్ మాలిక్ మాత్రమే. ముందు ఆయన పేరు కళ్యాణ్ మాలిక్ అని ఉండేది. తర్వాత కల్యాణ్ కోడూరిగా మార్చుకున్నారు. ఇదే క్రమంలో ఎం ఎం శ్రీలేఖ ఉన్నారు. ఈవిడ కీరవాణికి చెల్లెలు. తాజ్ మహల్, అదిరిందయ్యా చంద్రం, ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాలకు శ్రీలేఖ సంగీతం అందించారు. ఈమె పూర్తి పేరు మణిమేఖల శ్రీలేఖ.
ఇది కూడా చదవండి ==> ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ మ్యాజిక్ షో.. నోరెళ్లబెట్టిన జడ్జి రోజా, రష్మీ, వర్ష?
ఇది కూడా చదవండి ==> అయిపాయె.. యాంకర్ ప్రదీప్ కు ఐలవ్యూ చెప్పేసిన శ్రీముఖి? షాక్ లో అభిమానులు..!
ఇది కూడా చదవండి ==> రాజమౌళిపై రామ్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు..!
ఇది కూడా చదవండి ==> రాజమౌళి – మహేష్ కాంబో.. పొరపాటున పాయింట్ లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్