Sundaram Master : బ్ర‌తికి ఉన్న కొరియోగ్రాఫ‌ర్‌ని చంపేశారుగా.. అస‌లు ఏం జ‌రిగింది అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sundaram Master : బ్ర‌తికి ఉన్న కొరియోగ్రాఫ‌ర్‌ని చంపేశారుగా.. అస‌లు ఏం జ‌రిగింది అంటే..!

Sundaram Master : బ్ర‌తికి ఉన్న వాళ్ల‌ను చంపేయడం కొత్తేమి కాదు. పూర్తి వివ‌రాలు తెలుసుకోకుండానే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంటారు. తాజాగా తెలుగు నాటక రంగానికి హాస్యంతో కొత్త శైలి చూపిన రంగస్థల నటులు, దర్శకుడు, నవలా రచయిత తల్లావఝ్జల సుందరం మాస్టారు (71) కన్నుమూశారు. చిక్కడపల్లిలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందంటూ సుందరం మాస్టారు తన మిత్రుడు తనికెళ్లభరణికి ఫోన్‌ చేశారు. అయితే ఆయ‌న శిష్యులు వెంట‌నే ముషీరాబాద్‌ కేర్‌ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :24 March 2022,12:30 pm

Sundaram Master : బ్ర‌తికి ఉన్న వాళ్ల‌ను చంపేయడం కొత్తేమి కాదు. పూర్తి వివ‌రాలు తెలుసుకోకుండానే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంటారు. తాజాగా తెలుగు నాటక రంగానికి హాస్యంతో కొత్త శైలి చూపిన రంగస్థల నటులు, దర్శకుడు, నవలా రచయిత తల్లావఝ్జల సుందరం మాస్టారు (71) కన్నుమూశారు. చిక్కడపల్లిలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందంటూ సుందరం మాస్టారు తన మిత్రుడు తనికెళ్లభరణికి ఫోన్‌ చేశారు. అయితే ఆయ‌న శిష్యులు వెంట‌నే ముషీరాబాద్‌ కేర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుందరం మాస్టారు మరణవార్త విన్న పలువురు రంగస్థల ప్రముఖులు నివాళులర్పించారు.

న‌వ‌లా ర‌చ‌యిత సుంద‌రం మాస్టారు మ‌ర‌ణ వార్త విన్న త‌ర్వాత మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఒక టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అయినటువంటి సుందరం మాస్టర్ ఇక లేరు అనే వార్త సినీ వర్గాలను విష్మయానికి లోను చేసింది. చాలా మంది ఆయన పైనే పలు పోస్టులు కూడా పెట్టేసారు. కానీ సినీ వర్గాల నుంచి లేటెస్ట్ క్లారిటీ ప్రకారం అయ్యితే అస్సలు ఈ స్ప్రెడ్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదట. సుందరం మాస్టర్ బాగానే ఉన్నారని ఆరోగ్యంగానే ఉన్నారని సినీ వర్గాల నుంచి లేటెస్ట్ సమాచారం. దీనితో ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యొద్దు అని అందరు మనవి చేసుకుంటున్నారు.

false news on sundaram master death

false news on sundaram master death

Sundaram Master : తప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేయోద్దు..

సుందరం మాస్టారు కన్నుమూయడంతో పలువురు రంగస్థల ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. అమెరికా నుంచి ఆయన కుమారుడు, కుమార్తె రావాల్సి ఉండగా.. ఆ తరువాత ఈనెల 23న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సుందరం మాస్టారు అంత్యక్రియలు జరగనున్నాయి. 1950 అక్టోబరు 29న ఒంగోలులో జన్మించారు సుందరం మాస్టారు. బీఎస్సీ చదివిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రంగ స్థల కళల విభాగంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య శిరీష మరణించారు.

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది