Gemini TV : తీవ్ర సంక్షోభంలో జెమిని టీవీ.. అసలేం జరుగుతోంది? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Gemini TV : తీవ్ర సంక్షోభంలో జెమిని టీవీ.. అసలేం జరుగుతోంది?

Gemini TV : మూడు దశాబ్దాల క్రితం మొదలు అయిన శాటిలైట్ ఛానల్స్ సందడి పీక్స్ కు చేరింది. దేశ వ్యాప్తంగా వందల కొద్ది శాటిలైట్‌ ఛానల్స్ పెరిగాయి. వాటిలో మెజార్టీ శాతం న్యూస్ ఛానల్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇక ఎంటర్ టైన్మెంట్‌ ఛానల్ విషయానికి వస్తే చాలా టీవీలు ప్రేక్షకులు వినోదాన్ని పండిస్తున్నాయి. తెలుగు లో శాటిలైట్‌ ఛానల్స్ హవా ప్రారంభం అయిన సమయంలో జెమిని మరియు ఈటీవీలు నువ్వా నేనా అన్నట్లుగా ఉండేవి. అప్పుడు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 May 2022,1:30 pm

Gemini TV : మూడు దశాబ్దాల క్రితం మొదలు అయిన శాటిలైట్ ఛానల్స్ సందడి పీక్స్ కు చేరింది. దేశ వ్యాప్తంగా వందల కొద్ది శాటిలైట్‌ ఛానల్స్ పెరిగాయి. వాటిలో మెజార్టీ శాతం న్యూస్ ఛానల్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇక ఎంటర్ టైన్మెంట్‌ ఛానల్ విషయానికి వస్తే చాలా టీవీలు ప్రేక్షకులు వినోదాన్ని పండిస్తున్నాయి. తెలుగు లో శాటిలైట్‌ ఛానల్స్ హవా ప్రారంభం అయిన సమయంలో జెమిని మరియు ఈటీవీలు నువ్వా నేనా అన్నట్లుగా ఉండేవి. అప్పుడు జెమిని టీవీ నెం.1 గా నిలిచేది.

జెమిని టీవీ ఉమ్మడి ఏపీలో దాదాపుగా పుష్కర కాలం పాటు నెం.1 గా కొనసాగింది. ఎప్పుడైతే మా టీవీ మరియు జీ తెలుగు ఛానల్స్ వచ్చాయో జెమిని టీవీ స్థాయి రేటింగ్‌ పడిపోవడం మొదలు అయ్యింది. సీరియల్స్ చేసినా కూడా వాటిని జనాలు చూసేందుకు ఆసక్తి చూపక పోవడం మొదలుకుని జెమినిలో వచ్చే ప్రతి ఒక్క షో ను కూడా జనాలు తిరష్కరిస్తూనే వచ్చారు. దాంతో జెమిని టీవీ రేటింగ్‌ మరీ దారుణంగా పడిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

why gemini tv not getting good rating

why gemini tv not getting good rating

సన్ నెట్‌ వర్క్‌ ఆధ్వర్యంలో సాగుతున్న జెమిని టీవీ నెలవారి ఖర్చులకు మరియు వస్తున్న ఆదాయంకు పొంతన లేకుండా ఉందట. భారీ మొత్తంలో నష్టం వస్తున్నా కూడా చేసేది లేక టీవీని సన్ నెట్‌ వర్క్‌ వారు కొనసాగిస్తున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళంలో సన్‌ నెట్‌ వర్క్ వారి చానల్స్ కు భారీ గా లాభాలు వస్తాయి. కనుక వాటిని జెమిని టీవీలో పెడుతున్నాడు అనేది కొందరి అభిప్రాయం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి జెమిని టీవీకి రావడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మూస పద్దతిలో వెళ్లడం వల్ల జెమిని టీవీ కి ఈ దుస్థితి అనేది కొందరి అభిప్రాయం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది