Guppedantha Manasu 04 August 2022 Episode : దేవయానికి రెండు రోజులు డెడ్ లైన్ పెట్టిన సాక్షి.. వసుధర తో ఎంజాయ్ చేస్తున్న రిషి..
Guppedantha Manasu 04 August 2022 Episode : మా రీషికే కాదు.. మా ఇంట్లో ఎవరికీ నువ్వంటే ఇష్టం లేదు సాక్షి.. ఈ పెళ్లి జరగదు సాక్షి.. ఏం చేసుకుంటావో చేసుకోపో.. మహా అయితే గొడవ చేస్తావ్.. రచ్చ చేస్తావ్ అంతేగా.. అయినా మనసులో నువ్వంటే ఇష్టం లేని వాళ్ళతో ఎన్ని రోజులు బలవంతంగా కాపురం చేస్తావు.. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు సాక్షి అని దేవయాని అంటుంది.. అదేంటి ఆంటీ ముందు నుంచి ఇప్పటివరకు మీరే కదా నాకు సపోర్ట్ చేసింది.. ఇప్పుడు మీరు కూడా ఇలాగే మాట్లాడుతాన్నారు ఏంటి అని సాక్షి అడుగుతుంది.. అవును నేను రిషితో నీ పెళ్లి చేద్దామని అనుకున్నాను.. కానీ రిషి మనసులో నువ్వు లేవనీ తెలిసాక నేను చేయగలిగింది ఏముంది..!? నేను ఏమీ చేయలేను సాక్షి అని దేవయాని అంటుంది.. మీరు ఏం చేయక పోయినా నేను చేసేది నేను చేస్తాను.. మీ మీద కేసు పెడతాను.. మీ ఇంట్లో అందరినీ ఈ కేసులో ఇరికిస్తాను అని అంది..
ఆంటీ రెండు రోజుల్లో మా ఇంటికి లగ్న పత్రిక రాయడానికి పిలుపు రావాలి.. లేకపోతే నేనే పాయిజన్ బాటిల్ తెచ్చుకొని మీ అందరి ముందు తాగి.. నా చావుకు మీరే కారణం అని మీడియాతో చెప్తాను.. మీ అందరి కళ్ళముందే నా ప్రాణాలు తీసేసుకుంటాను.. ఆంటీ రెండే రెండు రోజులు గుర్తుంచుకోండి.. నా పెళ్లి జరగకపోతే మీ ఇంటి పరువు తీస్తాను అని అందరిని బెదిరిస్తూ చెబుతుంది సాక్షి.. వసుధర తో తిరుగుతాడా అది కూడా నేను చూస్తాను అని సాక్షి అంది..! దేవయాని సాక్షి వెళ్ళిపోయిన తర్వాత గోధుమనే వెంటనే రిషికి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటుంది.. అయినా మీకు ఎవ్వరికీ నా ప్రాబ్లెమ్ అర్థం కాదు.. రిషి ఒక్కడే నన్ను అర్ధం చేసుకుంటాడు అని అంటుంది దేవయాని.. ధరణి వెళ్లి దేవయానికి కాఫీ ఇస్తుంది.. నేను ఇంత బాధపడుతుంటే నువ్వు నాకు టీ కాఫీలు ఇస్తున్నావా అని తనపై ఫైర్ అవుతుంది..
ఆ మాటలు విన్న జగతి ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా కానీ అంటుంది.. రిషి కార్ ఆగిపోవడంతో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వసుధర రిషిలను తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు.. రిషి సార్ మిషన్ ఎడ్యుకేషన్ వాళ్ళనే మా పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారని.. మెకానిక్ వచ్చి కార్ రిపేరు చేసే వరకు మా ఇంట్లో ఉండమని చెబుతాడు.. రిషి కూడా ఒప్పుకొని వాళ్ళింటికి వెళ్తాడు.. ఇక ఆరోజు మధ్యాహ్నం భోజనం చేస్తారు.. వసుధర పిల్లలకు చదువు చెబుతుండగా కరెంటు పోతుంది.. అందరూ ఇళ్లల్లో ఉండి వీళ్ళ ఇంట్లోనే కరెంటు పోయిందంటే కచ్చితంగా ఫ్యుజ్ పోయిందనుకొని వసుధార ఫ్యుజ్ చెక్ చేస్తుంది.. అలా ఫ్యుజ్ వేస్తున్న వసుధార పడిపోతుండగా రిషి పట్టుకుంటాడు.. అప్పుడే వసుధర తన మనసులో మాట రిషి కి చెప్పాలి అనుకుంది.. అంతలో ఫ్యుజ్ వేశారా మేడం అని అనగానే వసుధర, రిషి అలెర్ట్ అవుతారు..