Hyper Aadi : ఒక్క స్పీచ్ లో త్రివిక్రమ్, ఖలేజా సినిమా, పవన్ నీ కవర్ చేసేసిన హైపర్ ఆది వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : ఒక్క స్పీచ్ లో త్రివిక్రమ్, ఖలేజా సినిమా, పవన్ నీ కవర్ చేసేసిన హైపర్ ఆది వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :16 February 2023,12:40 pm

Hyper Aadi : జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు పడి చస్తారు. హైపర్ ఆది పంచ్ అంత బాగా పేలుద్ది. యూట్యూబ్ లో కూడా జబర్దస్త్ స్కిట్ లలో హైపర్ ఆది.. స్కిట్స్స్ కీ రికార్డ్ స్థాయిలో వ్యూస్ ఉంటాయి. ఇంకా అదే విధంగా బయట పలు సినిమా ఇంకా రాజకీయ వేడుకలలో హైపర్ ఆది స్పీచ్ అంటే జనాలు పడిచస్తారు. ఇదిలా ఉంటే వెంకీ అట్లూరి దర్శకత్వంలో హీరో ధనుష్ హీరోగా నటించిన సినిమా “సార్”. ఫిబ్రవరి 17వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలు హైపర్ ఆది అదరగొట్టే రీతిలో తన స్పీచ్ ఇచ్చారు.

Hyper Aadi Superb Words About Pawan Kalyan Mahesh Babu

Hyper Aadi Superb Words About Pawan Kalyan, Mahesh Babu

సినిమా యూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించి డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంకా పవన్ , ఖలేజా సినిమా లపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. తన ఆల్ టైం ఫేవరెట్ దర్శకుడు త్రివిక్రమ్ అని చెప్పుకొచ్చారు. ఆయన స్పీచ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఆయన మాట్లాడిన స్పీచ్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మామూలుగా దర్శకులు తీసే ఫైట్లు మరియు పాటలు ఇంకా సైన్స్ కోసం చాలామంది పదేపదే చూస్తారు. కానీ ఇండస్ట్రీలో ఏదైనా దర్శకుడు స్పీచ్ ఇస్తే పదేపదే చూడాలి అని అనిపించే దర్శకుడు త్రివిక్రమ్ అని పొగిడారు. ఆయన తీసిన ఖలేజా సినిమా థియేటర్ లో యావరేజ్

Hyper Aadi Superb Words About Pawan Kalyan Mahesh Babu

Hyper Aadi Superb Words About Pawan Kalyan, Mahesh BabuHyper Aadi Superb Words About Pawan Kalyan, Mahesh Babu

అయిన గాని టీవీలో ఇప్పటికీ సినిమా వస్తే ఎవరు వదిలిపెట్టరు. టీవీలో ఖలేజా సినిమా చూసినప్పుడల్లా అరే ఈ సినిమా అప్పట్లో పోయింది ప్రేక్షకుల.. తప్పు అని పశ్చాత్తాపం పడేలా చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్… పవన్ కాంబినేషన్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. తెల్ల పేపర్ కీ సరిగ్గా న్యాయం చేయగలిగే వ్యక్తి త్రివిక్రమ్ అని కొనియాడారు. మాటలకి మనిషి రూపం వస్తే అది మాట్లాడే మొదటి మాట థాంక్యూ త్రివిక్రమ్ గారు, ప్రాసకి ఆశ కలిగితే అది చూడాలనుకునే మొదటి ఫేసు త్రివిక్రమ్ గారిదే. ఆయనది భీమవరం ఆయన మన ఇండస్ట్రీకి లభించిన ఓ వరం అంటూ హైపర్ ఆది సార్ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ నీ పొగడ్తలతో ముంచేత్తారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది