Intinti Gruhalakshmi 16 Dec Today Episode : తులసిని కాదని లాస్యను పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకున్న నందు.. పెళ్లి ఏర్పాట్లు ప్రారంభం.. ఇంతలో తులసికి మరో షాక్
Intinti Gruhalakshmi 16 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 504 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య ప్లాన్ ను అర్థం చేసుకోలేని తులసి.. లాస్య చెప్పినట్టుగా ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు రెడీ అవుతుంది. కుటుంబ సభ్యులు ఎవ్వరు చెప్పినా వినదు తులసి. నందు ఎంత నచ్చజెప్పినా కూడా వినదు. ఇంతలో లాస్య వచ్చి.. ఆగు తులసి నువ్వు […]
Intinti Gruhalakshmi 16 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 504 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య ప్లాన్ ను అర్థం చేసుకోలేని తులసి.. లాస్య చెప్పినట్టుగా ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు రెడీ అవుతుంది. కుటుంబ సభ్యులు ఎవ్వరు చెప్పినా వినదు తులసి. నందు ఎంత నచ్చజెప్పినా కూడా వినదు. ఇంతలో లాస్య వచ్చి.. ఆగు తులసి నువ్వు ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదు అంటుంది. దీంతో తులసి షాక్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు కనుక నువ్వు వెళ్లావంటే నిన్ను రెచ్చగొట్టి నేనే నిన్ను పంపిస్తున్నానని వీళ్లు అనుకుంటారు. పొరపాటున కూడా నువ్వు వెళ్లాక నీకు ఏదైనా జరిగితే నన్నే బాధ్యురాలిని చేస్తారు అని అంటుంది లాస్య. దీంతో తులసికి పిచ్చి ఎక్కుతుంది. ఇక ఆపు లాస్య. ఇది తెగ సమస్య కాదు. అందుకే తెంపేసుకొని వెళ్తున్నాను అంటుంది తులసి.
మీ అబ్బాయి పెట్టిన సమస్యల ముందు ఇదో లెక్క కాదు.. అంటుంది తులసి. తులసి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అంటే.. నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటుంది తులసి. ఇప్పటికే నేను 1000 సార్లు చెప్పాను అంటుంది తులసి. నన్ను చూసుకోవడానికి అందరూ ఉన్నారు. కానీ.. లాస్యను చూసుకోవడానికి మీరు తప్పించి ఇంకెవ్వరూ లేరు అంటుంది తులసి. నువ్వు వెళ్లిపోతే మేము కూడా మీతో వస్తాము అంటారు కుటుంబ సభ్యులు. తనతో పాటు బయటికి వస్తారు. వద్దు అని వారిస్తారు. కానీ.. తులసి మాత్రం వినదు. ఇంటి బయటికి వస్తుంది తులసి. లాస్య ఇవన్నీ చూస్తూ నిలబడుతుంది. దయచేసి నా మాట విను తులసి అంటాడు నందు. నేను ఇక్కడే ఉండాలంటే.. వెంటనే లాస్యను పెళ్లి చేసుకుంటా అని చెప్పండి అంటుంది తులసి. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో సరే.. ఒప్పుకుంటున్నాను వెంటనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. దీంతో తులసి షాక్ అవుతుంది.
అమ్మా తులసి నువ్వు చేస్తున్నది చాలా తప్పు అమ్మ అంటుంది అనసూయ. ఇంతకంటే నేను ఇంకేం చేయలేను. నాలా ఇంకో ఆడదాని బతుకు ఇలా కాకూడదు అంటుంది తులసి. లోపలికి తులసి వెళ్లబోతుండగా.. లాస్య వచ్చి చాలా థ్యాంక్స్ తులసి అంటుంది. దీంతో ఏం మాట్లాడకుండానే తులసి ఇంట్లోకి వెళ్లిపోతుంది. తను వెళ్లిపోగానే లాస్య తనలో తానే నవ్వుకుంటుంది.
మరోవైపు కుటుంబ సభ్యులు అందరూ టెన్షన్ పడతారు. అసలు మమ్మీకి ఎందుకు ఇంత టెన్షన్. ఇంత మంచితనం ఎందుకు. తను అంత రిస్క్ తీసుకొని వాళ్ల పెళ్లి ఎందుకు చేయించాలి అని అనుకుంటారు ప్రేమ్, శృతి, అభి, అంకిత. మనమందరం మరిచిపోయిన ఒక మాట ఒకటుంది. లాస్య పెళ్లి చేస్తా అని మమ్మీ లాస్యకు మాటిచ్చింది అంటాడు ప్రేమ్.
ఏది ఏమైనా మనం ఈ పెళ్లి ఆపుదాం అంటుంది అంకిత. ఈ పెళ్లి జరిగితే మమ్మీ మాత్రమే కాదు.. మనం కూడా నష్టపోతాం అంటుంది దివ్య. వాళ్ల పెళ్లి జరిగితే మన ఇంట్లో ప్రతి రోజు గొడవలే అంటుంది దివ్య. ఒకవేళ పెళ్లి జరిగితే.. లాస్య తన విశ్వరూపం చూపిస్తుంది. ఆంటిని కూడా లెక్కచేయదు అంటుంది అంకిత.
కానీ.. మనం ఈ పెళ్లి ఆపితే అమ్మకు ఎదురు తిరిగినట్టే అవుతుంది అంటాడు ప్రేమ్. మనమే తన వాళ్లు అని అనుకుంటోంది తను. ఈ సమయంలో మనం ఏం చేయాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించాలి.. తొందరపడకూడదు అంటుంది శృతి. ఏది ఏమైనా అమ్మ సంతోషం మనకు ముఖ్యం అంటాడు ప్రేమ్.
మామ్ తప్పు చేసిందని అదే తప్పును మనం కూడా చేద్దామా అంటాడు అభి. దీంతో ప్రేమ్ ఏదో ఆలోచిస్తాడు. ఒడ్డున ఉన్నవాళ్లం మనమే ఇంతగా ఆ సమస్య గురించి ఆలోచిస్తుంటే.. అన్నీ తన మెడలో వేసుకున్న అమ్మ ఈ సమస్య గురించి ఎంతలా ఆలోచిస్తుందో అంటాడు ప్రేమ్.
Intinti Gruhalakshmi 16 Dec Today Episode : నందు పెళ్లికి ఒప్పుకోవడంతో సంతోషంలో ఎగిరి గంతేసిన లాస్య
కట్ చేస్తే.. నందు ఇంకా తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో లాస్య వచ్చి నందు నాకు చాలా హ్యాపీగా ఉంది. గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది.. అంటుంది. పెళ్లేమీ నీకు కొత్త కాదు.. నాకు కొత్త కాదు అంటాడు నందు. దీంతో.. మనిద్దరం చేసుకుంటున్నాం కదా అంటుంది లాస్య. ఎన్నో ఏళ్లబట్టి డేటింగ్ లో ఉన్నవాళ్లు అయినా.. ప్రెష్ గా పెళ్లి అనేసరికి.. మొహంలో పెళ్లి కల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటుంది లాస్య.
కానీ.. నువ్వు మాత్రం ఏం పట్టనట్టుగా ఉన్నావు ఎందుకు అంటుంది లాస్య. దీంతో దయచేసి నన్ను ఇప్పుడే ఏం అడగకు లాస్య అంటాడు నందు. ఏంటి నందు ఇలా ఉన్నావు.. తులసి అడిగింది కాబట్టి ఒప్పుకున్నావు కానీ.. నేను అడిగానని కాదు అంటుది లాస్య.
అయినా నువ్వు ఎలా ఒప్పుకుంటేంది. నాకు మన పెళ్లి అవడం అనేది ముఖ్యం అంటుంది లాస్య. అయినా నువ్వు ఇంకా తులసి గురించే ఆలోచిస్తున్నావా? తను నిన్ను పట్టించుకోకున్నా.. నువ్వు మాత్రం ఎందుకు తన గురించే ఆలోచిస్తున్నావు. తను నిన్ను గడ్డిపోచలాగా తీసేసినా నువ్వు తన వెనుకే తిరగడం నాకు నచ్చడం లేదు అంటుంది లాస్య.
మరోవైపు అనసూయ.. తులసి గురించే ఆలోచిస్తుంటుంది. ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. అనసూయ.. తులసితో మాట్లాడదు. అలుగుతుంది. నువ్వు ఎంత బతిమిలాడినా ఇక్కడ నీతో మాట్లాడేవాళ్లు ఎవ్వరూ లేరు అంటుంది అనసూయ. నీకు ఆటలు అయిపోయాయా.. అంటుంది. దీంతో ఎంతైనా మొగుడు వదిలేసిన ఆడదాన్ని కదా.. నాకు ఇంత కంటే ఎక్కువ గౌరవం ఎలా ఉంటుంది అంటుంది.
నేను ఏ తప్పు చేయలేదని నా అంతరాత్మకు తెలుసు. నా భర్త నన్ను వదిలేశాడు అంటూ ఏదేదో మాట్లాడబోతుంది తులసి. దీంతో నా కొడుకుకు బుద్ధి లేదు కాబట్టి వాడు వదిలేసుకున్నాడు. నేనెందుకు వదిలేసుకుంటాను అంటుంది అనసూయ.
అనసూయ తులసిని ఓదార్చుతుంది. నిన్ను ఎవ్వరూ వదులుకోరు అంటుంది. దీంతో తులసి భావోద్వేగానికి గురవుతుంది. అత్తయ్య కాసేపు మీ ఒడిలో పడుకోవచ్చా.. అమ్మ గుర్తొచ్చింది అంటుంది తులసి. దీంతో అనసూయ సరే అంటుంది. కాసేపు.. అనసూయ ఒడిలో సేదదీరుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.