Intinti Gruhalakshmi 12 Dec Today Episode : తులసి ముడుపులో ఏం రాసి ఉందో చదివి షాక్ అయిన సామ్రాట్.. తన కోరికను సామ్రాట్ నెరవేర్చుతాడా?
Intinti Gruhalakshmi 12 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 813 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును.. మీకు ఈ గుడి గురించి ఎవరు చెప్పారు అంటే ఆఫీసులో కొందరు చెప్పారు. ఇక్కడ అమ్మవారిని కోరుకొని ముడుపులు కడితే తప్పకుండా తీరుతుందట అని చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరూ గుడిలోపలికి వెళ్లి పూజ చేస్తారు. దేవుడి హారతి తీసుకుంటారు. తర్వాత సామ్రాట్ కు బొట్టు పెడుతుంది తులసి. అమ్మవారికి పూజ చేసిన తర్వాత పంతులు గారు ముడుపు కట్టాలి అని అడుగుతాడు సామ్రాట్. దీంతో ఆ పక్కన చెట్టు ఉంది. కాగితం కావాలంటే ఇక్కడుంది అని చెబుతాడు. దీంతో కాగితం పెన్ను తీసుకొని చెట్టు దగ్గరికి వస్తారు ఇద్దరూ. అమ్మో.. ఎంత మంది ముడుపులు కడుతున్నారు అని అక్కడికి వచ్చి అనుకుంటుంది తులసి.
తర్వాత సామ్రాట్ ముడుపు రాసి అక్కడ ఉన్న ముడుపులో పెడతాడు. అక్కడ చెట్టుకు ముడుపు కడతాడు సామ్రాట్. ఇంతలో తులసికి కూడా ఒక ఆలోచన వస్తుంది. వెంటనే అక్కడికి వెళ్లి పెన్ను, పేపర్ తీసుకొని తను కూడా ముడుపు రాయాలనుకుంటుంది. వెంటనే కాగితం మీద ఏదో రాసి దాన్ని ముడుపుగా చేసి చెట్టుకు కడుతుంది తులసి. తను ఏం రాసిందా అని అనుకుంటాడు సామ్రాట్. తన దగ్గరికి వస్తాడు. ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది తులసి. దీంతో మీ ముఖంలో నవ్వు వెలిగిపోతోంది. మీరూ ముడుపు కడుతున్నారా? అని అడుగుతాడు. దీంతో అవును కడుతున్నా అంటుంది. ఆ ముడుపులో ఏం రాసి ఉందో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో దేవుడిని కోరుకునే మొక్కులు పైకి చెప్పకూడదు అని మా అమ్మమ్మ చెప్పింది అంటుంది తులసి.
ముడుపు కట్టి ఇద్దరూ వచ్చి కారులో కూర్చొంటారు. కానీ.. సామ్రాట్ కు మాత్రం తులసి ఆ ముడుపులో ఏం కట్టిందో తెలుసుకోవాలని అనుకుంటాడు. దీంతో హనీ కోసం అమ్మవారి కుంకుమ తీసుకొద్దామని మరిచిపోయా అంటాడు సామ్రాట్.
దీంతో మీరు కూర్చోండి నేను తీసుకొస్తా అంటుంది తులసి. దీంతో వద్దులేండి నేనే తెస్తా అని అంటాడు. మరోవైపు శృతి దీనంగా తన రూమ్ లో కూర్చొని ఉంటుంది. అంత డల్ గా ఉండటం చూసిన ప్రేమ్.. ఏమైంది శృతి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు.
దీంతో ఏం లేదు. నా మీద నాకే కోపంగా ఉంది అంటుంది. కట్టుకున్న వాడు అడిగిన చిన్న కోరికను కూడా నేను నెరవేర్చలేకపోయాను అంటుంది శృతి. అడగక అడగక ఫ్రైడ్ రైస్ చేయమని అడిగావు. ఇంతలో ఆ లాస్య ఆంటి అడ్డుపడింది అని మొత్తం చెబుతుంది శృతి.
Intinti Gruhalakshmi 12 Dec Today Episode : లాస్య గురించి ప్రేమ్ కు చెప్పిన శృతి
నాకు చాలా చిన్నతనంగా అనిపించింది ప్రేమ్ అంటుంది శృతి. వంట మధ్యలో స్టవ్ ఆఫ్ చేసి వెళ్లిపోవడం ఏంటి అంటుంది శృతి. కోపంతో తన దగ్గరికి వెళ్దామని వెళ్లబోతుండగా వద్దు వెళ్లకు అంటుంది శృతి.
తన ట్రాప్ లో మనం పడకూడదు అంటుంది శృతి. న్యాయం మనవైపే ఉన్నా అది ఎదుటివాళ్లకు అర్థం కాదు. అందుకే ఈ ఇష్యూ నీ దాక తీసుకురాకూడదని అనుకున్నా. కానీ.. ఫ్రైడ్ రైస్ గురించి అడిగితే చెప్పాలి కదా అందుకే చెప్పాను అంటుంది శృతి.
దీంతో తను వండనివ్వకపోతే ఏం.. ఫ్రైడ్ రైస్ ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి మరీ తన ముందే దర్జాగా తింటా అని ఆన్ లైన్ లో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెడతాడు ప్రేమ్. మరోవైపు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి తులసి ఆ ముడుపులో ఏం రాసిందో చూద్దామని ఆ ముడుపును ఓపెన్ చేస్తాడు సామ్రాట్.
ఇంతలో అక్కడికి పూజారి వచ్చి చూస్తాడు. కట్టిన ముడుపు విప్పకూడదు. అలా విప్పితే ముడుపు కట్టినా ప్రయోజనం ఉండదు. నీ కంగారు చూస్తుంటే నువ్వు విప్పిన ముడుపు నీది కాదని తెలుస్తోంది అవునా అంటాడు.
దీంతో అవును అంటాడు. దీంతో మీ వాళ్లదా అంటాడు. అవును అంటాడు. నేను చెడు చేయడానికి కాదు అంటాడు సామ్రాట్. దీంతో ఆ ముడుపును నువ్వు తీసి చదివావు కాబట్టి ఖచ్చితంగా ఆ ముడుపులో ఉన్న కోరికను నెరవేర్చాల్సిందే అని అంటాడు. దీంతో నేను నెరవేర్చుతా అంటాడు సామ్రాట్.
అసలు ఆ ముడుపులో ఏముంది అని అనుకుంటాడు సామ్రాట్. వెంటనే దాన్ని ఓపెన్ చేస్తాడు. అందులో నేను పుట్టిన ఊరికి వెళ్లాలి. నా ఇంట్లో తిరుగుతూ చిన్నప్పటి మెమోరీస్ ను నెమరు వేసుకోవాలి. చిన్ననాటి నేస్తాన్ని కలవాలి అని రాసి ఉంటుంది అందులో.
ఇంత చిన్న కోరిక కోరారేంటి అని అనుకుంటాడు సామ్రాట్. తులసి గారు పుట్టిన ఊరు ఏంటో తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు అని అనుకుంటాడు సామ్రాట్. తర్వాత ఇద్దరూ కలిసి కారులో వెళ్తుంటారు.
అమ్మ వారి కుంకుమ కోసం గుడికి వెళ్లి వచ్చాక మీలో ఏదో మార్పు కనిపిస్తోంది అంటుంది తులసి. దీంతో అవునా.. అదేం లేదే.. నేను మామూలుగానే ఉన్నాను అంటాడు సామ్రాట్. అమ్మ వారి కుంకుమ కోసం అంత సేపు ఎందుకు వెళ్లారు అని అడుగుతుంది.
పంతులు అడ్డుపడటంతో లేట్ అయింది అంటాడు సామ్రాట్. ఆ తర్వాత అమ్మ వారు నా కోరిక చదివిందో లేదో అంటే.. చదివేసిందండి అంటాడు సామ్రాట్. అంటే.. ముడుపు కట్టి చాలా రోజులు అయింది కదా అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.