Intinti Gruhalakshmi 26 Nov Today Episode : పరందామయ్య విషయంలో నందు షాకింగ్ నిర్ణయం.. అనసూయను ఇంట్లో నుంచి బయటికి నెట్టేసి.. తులసికి షాక్
Intinti Gruhalakshmi 26 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 నవంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 800 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనసూయను తీసుకొని తులసి ఇంటికి వెళ్తుంది. ఇంట్లోకి వస్తున్న అనసూయను చూసి నందు బయటికి వచ్చి ఆగు అంటాడు. నాన్న వచ్చేంత వరకు నువ్వు ఇంటికి రావద్దు అంటాడు నందు. అసలు నాన్నను ఇలా ఎలా అవమానించగలిగావు అంటాడు నందు. మానాన్న మీద ఒట్టు. మా నాన్నను అవమానించింది నువ్వు కాకుండా ఇంకెవరో అయి ఉంటే వాళ్లను అడ్డంగా నరికేసేవాడిని. కానీ.. ఆయన్ను అవమానించింది నా కన్న తల్లి అయిపోయింది అంటాడు నందు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని తులసిని అంటాడు నందు.

intinti gruhalakshmi 26 november 2022 full episode
నేను చెప్పేది వినండి అంటుంది తులసి కానీ.. నందు అస్సలు వినడు. ముందు మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటాడు నందు. దీంతో అనసూయ వెక్కి వెక్కి ఏడుస్తుంది. మరోవైపు పరందామయ్యను చూసి బాధపడుతుంటారు సామ్రాట్, బాబాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుంటారు. మీ నాన్న గారు నా దగ్గరే ఉన్నారు. మీరేం టెన్షన్ పడకండి అంటుంది తులసి. దీంతో థాంక్స్ అంటాడు నందు. దీంతో నువ్వు తులసికి ఎందుకు థాంక్స్ చెబుతున్నావు నందు అంటుంది లాస్య. అసలు దీని అంతటికి కారణం తులసే కదా. మామయ్య గారిని తన వైపునకు తిప్పుకొని తన దగ్గర దాచుకొని నాటకాలు ఆడుతోంది అంటుంది లాస్య.
దీంతో మనం గొడవ పెట్టుకోవడానికి ఇది సమయం కాదు లాస్య అంటుంది తులసి. నేను ఈ ఇంటికి పరాయి దాన్ని అని మీ ఆయన ఇందాకే చెప్పారు కదా. నేను ఆయనకు పరాయిదాన్ని అయితే.. ఆయన కూడా నాకు పరాయి మనిషే కదా. పరాయివాళ్లను ప్రశ్నించనని ఆయనే ఇంతకుముందు చెప్పారు కదా.
ఆయన ప్రశ్నలు ఆయన ఫ్యామిలీ మీద. మీరు భయపడాలి.. నేను కాదు అంటుంది తులసి. దీంతో ఎక్కువ చేస్తున్నావు తులసి. కావాలని తులసి మామయ్యను మనకు దూరం చేసి ఫ్యామిలీని ముక్కలు చేసి పండుగ చేసుకోవాలని అనుకుంటోంది అని అంటుంది లాస్య.
దీంతో నేను 26 ఏళ్లు ఈ ఇంటి కోడలుగా ఉన్నా. ఎప్పుడూ ఫ్యామిలీ విడిపోతుందేమో అని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇంటిని బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత కోడలుది. అది నీకు చేతగాక.. బయటి వారి మీద నిందలు వేసి తప్పించుకొని తిరుగుతున్నావు అంటుంది తులసి.
Intinti Gruhalakshmi 26 Nov Today Episode : లాస్యపై ఫైర్ అయిన నందు
నిజంగా నేను ఈ ఫ్యామిలీని ముక్కలు చేయాలని అనుకుంటే.. నేను ఈ ఇంట్లో నుంచి అడుగు పెట్టిన వెంటనే మామయ్య గారిని కూడా నాతో తీసుకెళ్లి ఉండేదాన్ని అంటుంది తులసి. ఆయన ఇక్కడ ఉన్నా కూడా మనసంతా నీదగ్గరే ఉంది అంటుంది.
ఆయన్ను నీ వైపునకు మార్చుకోకపోవడం నీ తప్పు అంటుంది తులసి. ఆయనకు నువ్వు కూతురు ఎందుకు కాలేకపోయావు అంటుంది తులసి. దీంతో అవును లాస్య.. నువ్వు ఎందుకు నాన్నను నీ వైపునకు తీసుకురాలేకపోయావు అని ప్రశ్నిస్తాడు నందు.
ఈ గొడవకు నువ్వు కూడా కారణం తులసి. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఏ గొడవ అయినా గీత దాటకుండా సాల్వ్ చేసేదానివి. ఎప్పుడైతే నువ్వు ఈ ఇల్లు దాటి వెళ్లిపోయావో అప్పటి నుంచి ఇంటి గొడవలు ఎక్కువయ్యాయి. ఫ్యామిలీని నీ వైపునకు తిప్పుకుంటున్నావు. నిజం ఒప్పుకో అంటాడు నందు.
దీంతో తులసికి కోపం వస్తుంది. మీరు మామయ్యను ఎంత ప్రేమిస్తున్నారో అంత కంటే కొంచెం ఎక్కువే ప్రేమిస్తున్నాను అంటుంది తులసి. దీంతో అసలు ఈ గొడవ అంతా ఆయన పుట్టిన రోజు నాడే ఎందుకు జరిగింది. ఇదంతా కావాలని నువ్వు చేసిన ప్లానే అంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.