Intinti Gruhalakshmi 27 Oct Today Episode : తులసి ముందే గొడవ పెట్టుకున్న శృతి, అంకిత.. ప్రేమ్ కు ఈ విషయం తెలిసి ఏం చేస్తాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 27 Oct Today Episode : తులసి ముందే గొడవ పెట్టుకున్న శృతి, అంకిత.. ప్రేమ్ కు ఈ విషయం తెలిసి ఏం చేస్తాడు?

 Authored By gatla | The Telugu News | Updated on :27 October 2021,11:50 am

Intinti Gruhalakshmi 27 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 అక్టోబర్, 2021 బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత కోసం నన్ను వచ్చి నిలదీస్తున్నావా? అంటూ అభితో తులసి అంటుంది. పర్లేదురా.. నేను సర్దుకుంటానులే. అమ్మనే కదా. కోడలుతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాను. అంకితను ఇక బాధపెట్టను అని అభికి చెబుతుంది. శృతికి కూడా నువ్వే చెప్పు అమ్మ. నీ అండ చూసుకొని రెచ్చిపోకుండా అంకితను ఏం అనొద్దని చెప్పు.. అని చెప్పి వెళ్లిపోతాడు అభి.

intinti gruhalakshmi 27 october 2021 full episode

intinti gruhalakshmi 27 october 2021 full episode

మరోవైపు అంకిత ఫోన్ చూస్తూ ఉంటుంది. అంకిత దగ్గరికి శృతి వచ్చి నాతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు డైరెక్ట్ గా చెప్పు. నన్ను అడ్డం పెట్టుకొని ఎందుకు ఇంట్లో గొడవలు పెడుతున్నావు అంటుంది. నీ వల్ల ఇంట్లో ఆంటికి మనశ్శాంతి లేకుండా పోతోంది. మనం ఆంటీకి ఇంకా కొత్త సమస్యలను క్రియేట్ చేయొద్దు. ఆంటీకి మనం కొత్త సమస్యగా ఉండొద్దు అంటుంది శృతి. నువ్వు మాత్రమే ఆంటి గురించి ఆలోచిస్తున్నావా? నీకు ఒక్కదానికే ఆంటి అయినట్టు ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నావు. నన్ను నువ్వు కావాలని బ్యాడ్ చేస్తున్నావు అని శృతితో అంటుంది అంకిత. నేను చెప్పేది నిజం అంటుంది అంకిత.

Intinti Gruhalakshmi 27 Oct Today Episode : గొడవ పెట్టుకున్న శృతి, అంకిత

ఇంతలో తులసి అక్కడికి వచ్చి ఏంటి మీరు తోటి కోడళ్లు ఇలా గొడవ పెట్టుకోవద్దు. లేని సమస్యలను, కొత్త సమస్యలను తీసుకురాకండి అని అంటుంది తులసి. మీలో ఇద్దరూ నాకు రెండు కళ్ల లాంటి వాళ్లు. మీ ఇద్దరూ నాకు ముఖ్యం. ఎవరూ ఎక్కువ కాదు. తక్కువ కాదు. నా మాట నమ్మండి అమ్మా.. అంటుంది తులసి. మీరు నా బిడ్డల్లాంటి వాళ్లు. చనువు కొద్ది మిమ్మల్ని ఏదైనా అంటే అది కోపంతో కాదు. అభిమానంతో అంటుంది తులసి.

intinti gruhalakshmi 27 october 2021 full episode

intinti gruhalakshmi 27 october 2021 full episode

ఇంతలో శృతి తన రూమ్ కు వెళ్తుంది. ప్రేమ్ వచ్చి.. గుడ్ న్యూస్ అంటూ చెబుతాడు. తనకు ప్రాజెక్ట్ వచ్చిందని.. చెబుతాడు. అంతా నువ్వు వచ్చిన వేళా విశేషం అంటాడు. కానీ.. నావల్లే ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటుంది శృతి. దీంతో ఏం జరిగింది అని అడుగుతాడు ప్రేమ్. జరిగిన విషయం ప్రేమ్ కు చెబుతుంది శృతి. దీంతో ప్రేమ్ సీరియస్ అవుతాడు. అభి దగ్గరికి వెళ్లబోతాడు కానీ.. శృతి ఆపుతుంది. ఇప్పుడు వెళ్లి నువ్వు అభితో గొడవ పెట్టుకోకు.. వద్దు.. అని ప్రేమ్ ను ఆపుతుంది శృతి.

ఉదయమే ప్రేమ్, శృతి.. ఇద్దరూ యోగా చేస్తుండగా చూసి అంకిత షాక్ అవుతుంది. వెంటనే లోపలికి వెళ్లి అభిని తీసుకొచ్చి చూపిస్తుంది. ఒకసారి చూడు… అంటుంది. వాళ్ల ఆవిడ ఫిట్ నెస్ కోసం ప్రేమ్ ఏం చేస్తున్నాడో చూశారు కదా. మీరు మాత్రం గురక పెట్టి నిద్రపోతారు అంటుంది అంకిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది