Intinti Gruhalakshmi 7 Feb Today Episode : అంకితను ట్రాప్ చేసిన లాస్య.. తులసిపై కోపం పెంచుకున్న అంకిత.. తులసి, అంకితను విడదీసేందుకు లాస్య మరో ప్లాన్.. ఇంతలో భారీ ట్విస్ట్
Intinti Gruhalakshmi 7 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 549 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాను రాను అంకిత కూడా అలాగే తయారైంది. ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో సాల్వ్ చేసుకోవాలి కానీ.. తన అమ్మను పిలవడం ఏంటి అని లాస్యతో అంటాడు నందు. నువ్వు కూడా ఆ గాయత్రికి సపోర్ట్ చేస్తున్నావేంటి. ఇక నుంచి నువ్వు కూడా ఇంట్లో పని చేయాలి. అంకితకు సాయం చేయొచ్చు కదా. ఇక నుంచి నువ్వేమీ ఈ ఇంట్లో అతిథివి కావు అని అంటాడు నందు. దీంతో లాస్య అందుకుంటుంది. మీ కోపాన్ని మొత్తం మగాళ్లు పెళ్లాల మీదనే చూపించుకుంటారు కదా. మీరు మారరు అంటూ నందుపై సీరియస్ అవుతుంది.
సరే జరిగిందేదో జరిగింది. తులసి అవన్నీ చూసుకుంటుందిలే. నువ్వు అంకిత విషయంలో మాట్లాడకు అంటాడు నందు. దీంతో వావ్ తులసి పేరు రాగానే నువ్వు ఎంత కూల్ గా మాట్లాడుతున్నావు. నేను కూడా తులసిలా మారనా. చెప్పు.. అంటుంది లాస్య. ఇంట్లో ఆవేశాలు గొడవలు ఎవ్వరికీ ఇష్టం లేవు లాస్య. ఒక్క నీకు, గాయత్రికి తప్ప.. అంటాడు నందు. అంటే ఏంటి.. అంకితను నేనే రెచ్చగొట్టాను అంటావా అంటుంది లాస్య. కాదని మాత్రం అనను అంటాడు నందు. మరోవైపు కిచెన్ లో ఏదో పని చేస్తూ ఉంటుంది తులసి. అక్కడికి వెళ్లిన అనసూయ ఈ ఇంట్లో జరిగే గొడవలకు అన్నింటికీ నేనే కారణం. సారీ అని చెబుతుంది అనసూయ.
ఏంటి అత్తయ్య గారు ఇది అంటుంది తులసి. అంకిత చిన్న మాటకు కూడా ఓర్చుకోలేకపోయింది అంటుంది అనసూయ. పిల్లలే తప్పులు చేస్తారు కదా అత్తయ్య అంటుంది తులసి. కూతురును క్షమించినప్పుడు కోడలును ఎందుకు క్షమించకూడదు అంటుంది తులసి. అంకిత మీద కోపం తెచ్చుకోవద్దు అత్తయ్య అంటుంది తులసి.
నాకు కోపం ఏం లేదు కానీ.. చిన్న గొడవకే వాళ్ల అమ్మకు ఫోన్ చేసి చెప్పింది అంటుంది అనసూయ. లేదు అత్తయ్య అంకిత ఎప్పుడూ అలా చేయదు అంటుంది తులసి. మరి అంకిత అమ్మకు ఎలా తెలిసింది అని అంటుంది అనసూయ. అది నాకు తెలియదు కానీ.. తను మాత్రం అలాంటి వ్యక్తి కాదు అంటుంది తులసి.
కట్ చేస్తే భాగ్యకు.. లాస్య ఫోన్ చేసి ఇంట్లో జరిగిన విషయాలన్నింటినీ చెబుతుంది. అంకిత మీద ప్రేమ చూపించు.. పొగడ్తలతో ముంచేయ్ అంటుంది భాగ్య. అంకిత.. పొగడ్తలకు పడిపోదేమో అంటుంది లాస్య. పొగడ్తలకు పడిపోనివారు ఎవ్వరూ ఉండరు. నీకు ఒక మంచి ఐడియా చెబుతాను.. దీన్ని అమలు చేయి.. నీదే పై చేయి అంటుంది భాగ్య.
Intinti Gruhalakshmi 7 Feb Today Episode : అంకితను కూల్ చేసిన ప్రేమ్, శృతి
మరోవైపు అంకిత ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తూ చాలా అలసటగా ఉంటుంది. ఇంతలో శృతి వచ్చి అంకిత అని పిలుస్తుంది. నాకు నీతులు చెప్పడానికి వచ్చారా.. అవసరం లేదు అని అంటుంది అంకిత. అయ్యో.. మేము వచ్చింది దానికోసం కాదు. నాకూ నీతులు చెప్పేవాళ్లు అంటే అస్సలు నచ్చదు అంటాడు ప్రేమ్.
ఈ పాలు తాగు అంకిత అంటుంది శృతి. నువ్వు భోజనం చేయకుండా ఉంటే.. మిగితా వాళ్లు ఎలా తింటారు.. అంటుంది శృతి. నాకు నిజంగా ఆకలిగా లేదు అంటుంది అంకిత. నువ్వు ఇలా ఆకలిగా ఉంటే.. ఈ ఇంట్లో వాళ్లు అన్నం తినరు.. కనీసం నిద్ర కూడా పోరు అంటుంది శృతి.
దీంతో సరే అని పాలు తాగుతుంది అంకిత. అడగ్గానే పాలు తాగినందుకు థ్యాంక్స్ అంకిత అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు శృతి, ప్రేమ్. ఇంతలో శృతి ఏమైందమ్మ. అంకిత పాలు తాగిందా అని అడుగుతుంది తులసి. చాలా థ్యాంక్స్ అమ్మ అంటుంది తులసి.
అవును.. అంకిత ఏమంటోందిరా.. నార్మల్ గానే ఉందా. ఇంకా నామీద కోపంగా ఉందా అంటుంది. వదిన చాలా కూల్ గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు అమ్మ అంటాడు ప్రేమ్. సరే.. మీరు వెళ్లి పడుకోండి. అని చెబుతుంది తులసి. మరోవైపు ట్యాబ్లెట్లు తీసుకురా అని అనసూయ.. శృతిని అడుగుతుంది. ఇంతలో ప్రేమ్ వచ్చి తనను వాటేసుకుంటాడు.
ప్రేమ్.. నేను ఎంత భయపడ్డానో తెలుసా అంటుంది శృతి. ఇదేం బాగోలేదు అంటుంది శృతి. దీంతో ఇంకో యాంగిల్ ట్రై చేస్తా అంటాడు ప్రేమ్. మొత్తానికి కాసేపు ఇద్దరూ రొమాన్స్ మాటలు మాట్లాడుకుంటారు. సరే.. చివరగా నీకు ఒక బహుమతి ఇచ్చి వెళ్తా అంటాడు ప్రేమ్.
ఐ లవ్యూ అని తన చేతుల్లో ఉన్న పువ్వును తనకు ఇవ్వబోతాడు కానీ.. దాని మీద పువ్వు ఉండదు. రాలిపోతుంది. దీంతో ప్రేమ్ షాక్ అవుతాడు. ఎంత బాగుందో నీ బహుమతి అంటూ తెగ నవ్వేస్తుంది. ఇంతలో ట్యాబ్లెట్స్ రెడీయా అని అడుగుతుంది అనసూయ. దీంతో వస్తున్న అమ్మమ్మ గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శృతి.
ఉదయమే తులసి.. టిఫిన్ రెడీ చేస్తుంది. శృతి కూడా తనకు సాయం చేస్తుంది. ఇంతలో అంకిత వస్తుంది. అర్జెంట్ ఆపరేషనా… ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ లో మాట్లాడుతూ డైనింగ్ టేబుల్ వద్దకు వస్తుంది. శృతి.. నాకు హాస్పిటల్ లో అర్జెంట్ ఆపరేషన్ ఉంది. నేను వెళ్లాలి అంటుంది.
టిఫిన్ చేశా.. తిని వెళ్లు అంకిత అంటుంది తులసి. కానీ.. తులసితో అంకిత మాట్లాడదు. నాకు ఇప్పుడు అంత సమయం లేదు.. నేను ఇప్పుడు తినలేదు అని శృతికి చెబుతుంది అంకిత. నాకు ఆటో దొరికి వెళ్లేసరికి నాకు చాలా లేట్ అవుతుంది అంటుంది అంకిత.
ఇంతలో లాస్య వచ్చి ఆటోలో వెళ్లడం ఎందుకు.. నేను నిన్ను కారులో డ్రాప్ చేస్తా పదా అంటుంది లాస్య. దీంతో థ్యాంక్స్ ఆంటి అంటుంది అంకిత. దీంతో కనీసం చపాతి అయినా తిని వెళ్లు.. ఆంటి నీకోసం బ్రేక్ ఫాస్ట్ చేసింది అని అంటుంది అంకిత. కానీ.. నాకు ఇప్పుడు తినడం కుదరదు అని చెప్పి అంకిత వెళ్లిపోతుంది.
దీంతో తులసి చాలా బాధపడుతుంది. అంకిత ఎందుకు ఇలా చేస్తుంది. నన్ను చూసి కూడా నాతో మాట్లాడలేదు అంటుంది తులసి. మీకు ఇంకో విషయం తెలుసా ఆంటి. ఈ విషయం చెప్పాలంటేనే నాకు చాలా బాధేస్తోంది. అంకిత.. నెమ్మదిగా లాస్య మాయలో పడిపోతుందేమో అనిపిస్తోంది అంటుంది శృతి. దీంతో తులసి భయపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.