Intinti Gruhalakshmi : అలాంటి బట్టలేసుకుంటే ఇలానే ఉంటుంది.. గృహలక్ష్మీ కస్తూరిపై సుమ కామెంట్స్
Intinti Gruhalakshmi యాంకర్ సుమ తన తోటీ తారలపై ఎలాంటి కామెంట్లు వేస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఆమె వేసే కామెంట్లు, కౌంటర్లకు అందరూ షాక్ అవ్వాల్సిందే. ఆమె ఏ షోలో కనిపించినా, ఏ గెస్ట్ వచ్చినా కూడా ఒకేలా ఆడేసుకుంటుంది. వారు వీరు అనే తేడా లేకుండా సుమ అందరిపై సెటైర్లు వేస్తుంటుంది. తాజాగా తన క్యాష్ షోకు గృహలక్ష్మీ టీం వచ్చింది.

Gruhalakshmi Team In Suma Cash Show
వారితో పాటు వదినమ్మ సీరియల్ నుంచి సుజిత వచ్చింది. ఇక ఈ నలుగురిని సుమ ఓ రేంజ్‌లో ఆడకుంది. గృహలక్ష్మీ నందు అలియాస్ హరికృష్ణ, లాస్య అలియాస్ ప్రశాంతి, తులసి అలియాస్ కస్తూరిల సమస్యను తీర్చేందుకు రెడీ అయింది. బతుకు జట్కా బండి, రచ్చ బండ లాంటి షోను క్యాష్ షోలో పెట్టేసింది. పచ్చని కుటుంబం అంటూ సుమ నవ్వులు పూయించింది.
Intinti Gruhalakshmi కస్తూరి మీద సుమ కౌంటర్లు

Gruhalakshmi Team In Suma Cash Show
అందులో మొదటగా కస్తూరిని స్టేజ్ మీదకు పిలిచింది. సీట్లో కూర్చోమని కస్తూరికి చెప్పగా.. ఆమె వేసుకున్న లాంగ్ ఫ్రాక్ వల్ల కూర్చోలేనని చెప్పింది. అయితే ఆ తరువాత హరికృష్ణను పిలిచింది. అతను సోఫాలో కూర్చుంది. ఆ తరువాత ప్రశాంతిని పిలిచింది. ఆమె వెళ్లి హరికృష్ణను అతుక్కుని మరీ కూర్చుంది. మరి అంత దగ్గరేం అవసరం లేదు అని కాస్త దూరంగా కూర్చోబెట్టింది. ఇలాంటి బట్టలు వేసుకుంటే అలానే జరుగుతుంది అని కస్తూరి మీద కౌంటర్లు వేసింది.