RRR : ఆర్.ఆర్.ఆర్ నుంచి ఆలియా భట్ ఇంకా బయటపడలేదా.. అందుకే ముందే ఆలోచించుకోవాలి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR : ఆర్.ఆర్.ఆర్ నుంచి ఆలియా భట్ ఇంకా బయటపడలేదా.. అందుకే ముందే ఆలోచించుకోవాలి..?

 Authored By govind | The Telugu News | Updated on :23 February 2021,7:33 pm
is aliyabhutta not out of rrr

is-aliyabhutta-not-out-of-rrr

RRR: ఆర్.ఆర్.ఆర్ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటి ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతుష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ మల్టీస్టారర్ గా టాలీవుడ్ లో రూపొందుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పోరాట యోధులుగా నటిస్తున్నారు. దేశభక్తి ప్రధానంగా ఫిక్షన్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. వీరిద్దరిని కలిపే కీలక పాత్రలో ఆలియా భట్ నటిస్తున్నట్టు సమాచారం.

అయితే రాజమౌళి ఈ సినిమాను సంవత్సరం లో కంప్లీట్ చేయాలని భావించాడు. ఇందుకు తగ్గట్టుగానే చరణ్ – తారక్ ఆర్.ఆర్.ఆర్ కోసం సంవత్సరం పాటు కాల్షీట్స్ ఇచ్చారు. అయితే కరోనా తో పాటు మరికొన్ని కారణాల వల్ల ఈ సినిమా మరో సంవత్సరం పాటు పోస్ట్ పోన్ అయింది. ఈ రకంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాకి అందరూ 2 ఏళ్ళు లాకయ్యారు. ఈ లిస్ట్ లో ఆలియా భట్ కూడా ఉంది. ఇప్పటికే ఆలియా ఆర్.ఆర్.ఆర్ కోసం ఇచ్చిన డేట్స్ కూడా తారుమారయిన సంగతి తెలిసిందే.

RRR : ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ లో చరణ్ – తారక్ తో పాటు ఆలియా భట్ కూడా లాకయింది.

అయినా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో పాల్గొంది ఆలియా భట్. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు సాంగ్స్ లో కూడా పాల్గొన్న ఆలియా తిరిగి ముంబై వెళ్ళిపోయింది. ఇప్పటికే అక్కడ కమిటయిన సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంది. కాగా ఇంకా ఆలియా భట్ ఆర్.ఆర్.ఆర్ సినిమా నుంచి బయట పడలేదని సమాచారం. ఇంకా ఈ సినిమా టాకీపార్ట్ కంప్లీట్ కావాల్సి ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుండగా ఆలియా భట్ – చరణ్ ల మీద తెరకెక్కించాల్సిన సీన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయట. మరి ఈ సీన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో చూడాలి. ఏదేమైనా ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ లో చరణ్ – తారక్ తో పాటు ఆలియా భట్ కూడా లాకయింది.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది