Jabardast : రోజా మంత్రి కావడంతో జబర్దస్త్ కమెడియన్స్ రెండు విధాలుగా హ్యాపీ
Jabardast : జబర్దస్త్ జడ్జి రోజా ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెకి మంత్రి పదవిని కట్టబెట్టి జబర్దస్త్ కి దూరం చేశాడు. సాక్షి టీవీ తో మాట్లాడుతూ రోజా జబర్దస్త్ కి దూరం అవుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. జబర్దస్త్ కు మాత్రమే కాకుండా టీవీ షో కూడా దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇక మీదట షూటింగ్ లో పాల్గొనను అంటూ ఆమె తెలియ జేసింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే చాలా మంది ఓట్లు వేసి గెలిపించింది ఇలా షూటింగులో పాల్గొనడానికి అంటూ విమర్శించారు. కానీ ఎప్పుడూ కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు షూటింగుల్లో పాల్గొన వద్దని ఆదేశించే లేదని చెప్పుకొచ్చారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఎలాంటి షూటింగుల్లో పాల్గొన వద్దని ఆదేశాలు ఇవ్వ లేదని తానే స్వయంగా షూటింగు లో పాల్గొన కూడదని నిర్ణయించుకుని ఇప్పటికే వారికి చెప్పేసినట్లుగా క్లారిటీ ఇచ్చేసింది. మల్లెమాల వారు ఇప్పటికే రోజాకు ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఇక రోజా మంత్రి పదవి దక్కించుకున్న నేపథ్యం లో జబర్దస్త్ కు చెందిన పలువురు కమెడియన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. మంత్రి వర్గంలో ఉండడం వల్ల తమకు సంబంధించిన వ్యవహారాలు చాలా వరకు పరిష్కారమవుతాయని ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కారం దొరుకుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జబర్దస్త్ కమెడియన్స్ లో ఎక్కువ శాతం మంది ఏపీకి చెందిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఇక మీదట ఏ సమస్య వచ్చినా వారికి అండగా రోజా నిలుస్తుంది. ఇది ఒక ఉపయోగం కాగా మరొక ఉపయోగం ఏమిటంటే గత కొన్నాళ్లు గా జబర్దస్త్ కమెడియన్స్ ఎంత కామెడీ చేయాలని చూసిన ఎంత గట్టి పంచ్ లు రాసుకున్నా కూడా దానిని రోజా ముందు చెప్పేసి కామెడీ రాకుండా చేసేది. దాన్ని కొందరు కామెడియన్స్ జీర్ణించుకోలేక పోయారు. కాని ఆ విషయాన్ని వాళ్లు బయటకి చెప్తే వారు కాదు. ఇప్పుడు రోజా లేకపోవడంతో తమకు అడ్డు లేదు అన్నట్టుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.