Jr NTR : కోరుకున్న కోరిక తీరకపోవడంతో బాధలో ఎన్టీఆర్ భార్య
Jr NTR : టాలీవుడ్ టాప్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయనకు పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. ఎన్టీఆర్ తన సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ తెచ్చుకున్నారో.. ఈయన భార్య ప్రణతి మాత్రం అటు సినీ ఇండస్ట్రీకి, ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 2011 మే 5వ తేదీన ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరి 11 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపిన ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు ఫ్యామిలీతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు . అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో వెకేషన్‌కి కూడా వెళుతుంటారు. ఇది కూడా చాలా సీక్రెట్‌గా జరుగుతూ ఉంటుంది.
Jr NTR : షాకింగ్ విషయం..
ఎన్టీఆర్ – ప్రణతి దంపతులకు ఇద్దరు కుమారులు అభయ్ రామ్ – భరత్ రామ్ ఉన్నారు. ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి పెళ్లి వెనకాల చాలా స్టోరీయే ఉంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. 2011 మే 5న వివాహబంధంతో భార్యభర్తలు అయ్యారు. ప్రణతి ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనకోడలు కుమార్తె. ఇటు ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నె శ్రీనివాసరావుకు కుమార్తె. ఎన్టీఆర్‌కు హరికృష్ణ పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఓ ప్రముఖ మీడియా సంస్థల అధినేత తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అది చంద్రబాబుకు తెలిసిన వెంటనే ఎన్టీఆర్ బయట ఫ్యామిలీ అల్లుడు అవ్వడం ఇష్టంలేక వెంటనే తాను రంగంలోకి దిగి ఈ పెళ్లి కుదిర్చారన్నదే నిజం.
తారక్ కంటే లక్ష్మీ ప్రణతికి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ లకు ఓ కోరిక తీరని కోరికగానే మిగిలిపోయింది. ఈ జంటకు ఒక ఆడపిల్ల కావాలని..ఇంట్లో ఓ మహాలక్ష్మీగా తిరుగుతూ ఉండాలని ఎంతో కోరుకున్నారట.. ఆశ పడ్డారట. కానీ, ఆ దేవుడు ఆ కోరిక నెరవేర్చలేదు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎన్టీఆర్.” నాకు లక్ష్మీ ప్రణతికి ఒక ఆడపిల్ల కావాలని చాలా కోరుకున్నామని కానీ రెండోసారి కూడా అబ్బాయి పుట్టేసరికి మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యామని, అమ్మాయి కోసం లక్ష్మీ ప్రణతి మూడవ బిడ్డను కూడా కనడానికి సిద్ధమైంది. కానీ ఆమె హెల్త్ కండిషన్ బాగోకపోవడం వల్ల నేనే వద్దన్నానని..” ఆయన చెప్పుకొచ్చారు.