Rajamouli : ఆ రోజు రాజమౌళి ఫ్యామిలీ ని డబ్బులిచ్చి ఇతను కాపాడకపోయి ఉంటే రాజమౌళి అనేవాడే లేడు..!!
Rajamouli ; టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను చేసి తెలుగు పరిశ్రమలోనే తిరుగులేని డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే రాజమౌళి తాను ఇంత పెద్ద డైరెక్టర్ కావడానికి తన ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందని చెప్తాడు. రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ రైటర్, రాజమౌళి భార్య కాస్ట్యూమ్ డిజైనర్ అన్న కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్, రాజమౌళి వాళ్ళ వదిన వల్లి లైన్ ప్రొడ్యూసర్, రాజమౌళి కొడుకు కార్తికేయ సినిమాకి సంబంధించిన అన్ని పనులను చూసుకుంటాడు.
అయితే వీళ్ళు ఈ స్టేజ్ కి రాకముందు చాలా కష్టపడ్డారు. కొన్నిసార్లు అయితే తినడానికి తిండి కూడా ఉండేది కాదట. ఆ టైంలో రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ రాసిన సినిమాలు సరిగ్గా ఆడక పోవడంతో ఆయనకి ఆఫర్స్ లేక ఖాళీగా ఉండేవారట. కీరవాణి గారి ఫాదర్ శివశక్తి దత్త గారు లిరిక్స్ రాసేవారు. ఆయనకి కూడా వర్క్ లేక ఖాళీగా ఉండేవారు. అప్పుడు రాజమౌళి తన తోబుట్టువులంతా చిన్నవాళ్ళు కావడంతో స్కూల్ కి వెళ్తూ ఉండేవాళ్ళు. వీళ్ళదంతా ఉమ్మడి కుటుంబం కావడంతో చిన్న పెద్ద అంతా కలిసి ఒక 25 మంది ఉండేవారు. ఎవరికి ఏ పని లేని సందర్భంలో కీరవాణి ఒక్కడే మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా చేసి వచ్చిన డబ్బుతో కుటుంబం మొత్తాన్ని పోషించేవాడు.
తన భార్య వల్లి కూడా ఇంటి పెద్దగా ఉండి చిన్నపిల్లలుగా ఉన్న రాజమౌళి వాళ్ళ బ్రదర్స్ అందరికీ వండి పెట్టేదట. ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లకి కూడా అన్ని పనులు చేసి పెట్టేదట. కీరవాణి దాదాపు రెండు మూడు సంవత్సరాలు కుటుంబాన్ని పోషించాడట. అందుకే ఇప్పటికి రాజమౌళికి కీరవాణి అన్న, వల్లి గారు అన్న చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఆ ఒక్క విషయంలో వాళ్ళిద్దరిని మించిన వాళ్లు ఎవరు ఉండరు. వల్లి గారు ఇదంతా నాకెందుకు మనం సెపరేట్ అయిపోదాం అని ఒక్క మాట కీరవాణితో అని ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆవిడ అలా అనలేదు. అందరూ నా వాళ్ళే అనుకోని పనిచేసింది. అందుకే మేము ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబం గానే ఉంటున్నాం అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.