keerthi suresh : నిండైన అందం చీరలోనే దాచిందా.. కట్టిపడేస్తున్న కీర్తి సురేశ్ వైరల్ ఫిక్స్ ..!
keerthi suresh : మహానటి సినిమాకు ముందు ఎంతమంది ఆవరేజ్ హీరోలతో చేసినా రాని గుర్తింపు.. ఈ ఒక్క సినిమాతో కొట్టేసింది కీర్తి సురేశ్. ఇక ఈ మూవీతో సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకుంది ఈ భామ. ఏకంగా తన మీద మహానటి అనే ట్యాగ్‌లైన్ పడేలా చేసుకుంది.

keerthi suresh traditional Looks
keerthi suresh : కీర్తి సురేశ్ కంటే కూడా మహానటి అంటేనే గుర్తు పట్టేంతగా ఇమేజ్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోలతో ఛాన్సులు కొట్టేసింది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో దాదాపు అందరు పెద్ద హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

keerthi suresh traditional Looks
keerthi suresh : ఇక ఎప్పుడూ సంప్రదాయ బద్ధమైన బట్టలతో ఫ్యాన్స్‌ను కట్టిపడేసే కీర్తి సురేశ్ ఇప్పుడు మరోసారి మెస్మరైజ్ చేసేసింది. ఓనమ్ పండుగ సందర్భంగా సంప్రదాయమైన చీరకట్టులో మెరిసిపోయింది. వైట్ కలర్ శారీలో అచ్చుగుద్దినట్టు సంప్రదాయమైన మళయాళ అమ్మాయిలాగా రెడీ అయిపోయింది. చూడటానికి నిండైన అందం చీరలోనే దాచిందన్నట్టుగా నవ్వులు ఒలకబోస్తూ దిగిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా కీర్తి షేర్ చేసింది.

keerthi suresh traditional Looks
keerthi suresh : ఇక తన కుక్కపిల్లతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సందర్భంగా అందరికీ ఓనమ్ పండుగ విషెస్ తెలిపింది కీర్తి. ఇప్పుడు తెలుగులో మహేశ్ బాబు సరసన సర్కారువారి పాట సినిమాలో చేస్తోంది ఈ మహానటి.

keerthi suresh traditional Looks
keerthi suresh : ఇటీవల వచ్చిన ఈ మూవీ టీజర్‌లో ఈ ముద్దుగుమ్మ ఎంత అందంగా కనిపించిందో అందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ కూడా రిలీజ్ కానుంది. అయితే మహానటి తర్వాత కీర్తి బాగా బరువు తగ్గి సన్నబడిపోయినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ట్రెడీషనల్ బ్యూటిఫుల్ ఫొటోలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.