Kichcha Sudeep : మీడియాకు లెఫ్ట్ రైట్ ఇచ్చిన స్టార్ హీరో.. సోషల్ మీడియా మారుమోగిపోతుందిగా..!
ప్రధానాంశాలు:
Kichcha Sudeep : మీడియాకు లెఫ్ట్ రైట్ ఇచ్చిన స్టార్ హీరో.. సోషల్ మీడియా మారుమోగిపోతుందిగా..!
Kichcha Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మీడియాకు లెఫ్ రైట్ ఇచ్చాడు. ఆయన నటించిన మ్యాక్స్ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సుదీప్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ముఖ్యంగా కన్నడిగులను రెచ్చగొట్టేలా మీడియా అడుగుతున్న ప్రశ్నలకు ఆయన మార్క్ సమాధానం ఇచ్చారు.
విజయ్ కార్తికేయన్ డైరెక్షన్ లో సుదీప్ హీరోగా వస్తున్న సినిమా మ్యాక్స్. ఈ సినిమా ప్రెస్ మీట్ లో మీడియా రిపోర్టర్స్ ఈ సినిమాకు మ్యాక్స్ అని ఇంగ్లీష్ టైటిల్ ఎందుకు పెట్టారని ప్రశ్న లేవనెత్తారు దానికి సుదీప్ మీ ఛానెల్ పేరు ఎందుకు ఇంగ్లీష్ లో ఉంది. కన్నడలో లేదు ఎందుకు అన్నారు. అంతేకాదు మీ ఫోన్ యాపిల్ అంటారు. దాన్ని కన్నడలో చెప్పొచ్చు కదా. కర్ణాటకలో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. అక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారని అన్నారు.
Kichcha Sudeep సినిమా అనేది యూనివర్సల్ అప్పీల్..
అంతేకాదు భాష అనేది మనం గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. దాన్ని ప్రతి విషయంలో తీసుకొచ్చి అవసరం లేని గొడవ వివాదం సృష్టించడానికి కాదని అన్నారు. కన్నడిగులు కొన్ని విషయాల్లో చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఐతే సినిమా అనేది యూనివర్సల్ అప్పీల్ ఉన్నది కాబట్టి ఏ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టాలన్నది కథను బట్టి ఉంటుందని అన్నారు సుదీప్.
మొత్తానికి సుదీప్ ఇచ్చిన ఆన్సర్ తో మీడియా వాళ్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయిందని చెప్పొచ్చు. సుదీప్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుదీప్ మ్యాక్స్ సినిమా కేవలం కన్నడలోనే రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో సుదీప్ పవర్ ఫుల్ పోలీస్ గా నటించారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ బాగుంది. ఈ క్రిస్ మస్ కి కన్నడలో సోలోగా వస్తున్న సుదీప్ మ్యాక్స్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. Kichcha Sudeep, Max, Sudeep Max Movie, Kannada