Chiranjeevi : చిరంజీవిని కోట శ్రీనివాస‌రావు అంతమాట అన్నాడేంటి.. ఎప్పుడైన రూపాయి సాయం చేశాడా..!

Advertisement

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పెద్ద‌గా వివాదాల‌లోకి దూర‌డు. కావాల‌ని కొంద‌రు ఏదో వంక చూపిస్తూ టార్గెట్ చేస్తుంటారు. అయితే చిరంజీవి ట్రోల్స్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా త‌న పని తాను చేసుకుంటూ వెళుతుంటారు. అయితే విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాస‌రావు ఇప్పుడు చిరంజీవిని విమ‌ర్శించ‌డం సంచ‌ల‌నంగా మారింది. కొన్ని నెలల క్రితం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల సమయంలో నాగబాబుని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కోటా. చిరంజీవిని కూడా కొన్ని విషయాల్లో తప్పుబట్టారు. ఇప్పుడు ఆయన చిరంజీవి మీద ఓ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘మే డే’ ఉత్సవాల్లో భాగంగా చిరంజీవి ఇచ్చిన స్పీచ్ పై కోటా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

చిత్రపురి కాలనీలో ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నట్లు చిరు చెప్పిన మంచి విషయం మీద స్పందించిన కోటా.. ముందు కార్మికులకు తిండి పెట్టాలని.. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎవరొస్తారని కోట ప్రశ్నించారు. ప్రతిభ వుండి కూడా ఎంతోమంది పని లేక కృష్ణానగర్‌లో ఆకలితో అలమటించడమే కాకుండా వ్యసనాల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. తాను సినీ కళాకారుడిని కాదని, కార్మికుడినని చిరు వ్యాఖ్యానించడాన్ని కోట తప్పుబట్టారు.కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతారని ప్రశ్నించారు కోటా. తనకు అలాంటి మాటలు నచ్చవని.. కానీ చిరంజీవి అంటే ఎంతో గౌరవమని చెప్పారు. పొగుడుతున్న‌ట్టే మాట్లాడిన కోట అప్పుడ‌ప్పుడు ఆయ‌న‌పై సెటైర్స్ వేశాడు. చిరంజీవి ఎవరికైనా ఏనాడైనా రూపాయి సాయం చేశారా …

Advertisement
Kota Srinivasa Rao comments on Chiranjeevi
Kota Srinivasa Rao comments on Chiranjeevi

Chiranjeevi : సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఆయన సినిమాల్లో ఎవరికైనా వేషాలు ఇప్పించారా అని ప్రశ్నించారు. సాయం కోరి తన ఇంటి దగ్గరకు వచ్చేవారికి డబ్బులిచ్చి పంపిస్తుంటానని.. ఇలా ఇబ్బందుల్లో ఉన్న కార్మికుల కోసం రూ.5 లక్షల దాకా సాయం చేశానని.. అంతే కానీ నేను ఇది చేస్తా, అది చేస్తానని చెప్పనని కోట వ్యాఖ్యానించారు.రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి తన తల్లితో గడినిప మధురమైన క్షణాల్ని వీడియో రూపంలో అభిమానులకు షేర్ చేశారు. ప్రపంచంలో తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. చిరు ఒక్కరే కాదు.. ఇందులో మెగా బ్రదర్స్ ముగ్గురు ఉన్నారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్… తమ తల్లి అంజనాదేవితో ఎంతో ఆనదంగా గడిపిన క్షణాల్ని వీడియోలో మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మన పవన్ కళ్యాన్ సాంగ్ పెట్టడం మరింత ఆసక్తిగా మారింది

Advertisement
Advertisement