Krishna Bhagavan : రఘుబాబును తుక్కు తుక్కు కొడతానంటున్న కృష్ణ భగవాన్.. అందుకేనట
Krishna Bhagavan : దర్శకుడు వంశీ చిత్రాల్లో తప్పనిసరిగా కనిపించే కమెడియన్ కృష్ణ భగవాన్ అంటే పరిచయం అక్కరలేని పేరు. ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ వేసుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో అయితే కృష్ణ భగవాన్ కారెక్టర్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అల్లరి నరేష్, కృష్ణ భగవాన్ కలిసి నటించిన చిత్రాలు అందరినీ కడుపుబ్బ నవ్విస్తాయి. మంచి కామెడీ టైమింగ్.. పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్వించే కృష్ణ భగవాన్ ఇప్పటిదాకా 100 కు పైగా చిత్రాల్లో నటించాడు. ఈయన కామెడీ ఎక్కువగా వెటకారం చేయడంలో ఉంటుంది.అయితే సినీ దర్శకుడు వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన మహర్షి మూవీతో కృష్ణ భగవాన్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కైకవోలు గ్రామానికి చెందిన మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతంకు 1965 జులై 2న జన్మించారు.
కృష్ణ భగవాన్ అసలు పేరు పాపారావు చౌదరి. ఏప్రియల్ 1మూవీలో విలన్ గా అదరగొట్టిన కృష్ణ భగవాన్ మొదట్లో విలన్ పాత్రల్లో రాణించినా.. ఆ తర్వాత కమెడియన్ అయ్యాడు. జైత్ర యాత్ర మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఆ తర్వాత ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు.కమెడియన్ కృష్ణ భగవాన్ తెర మీద కనిపించి చాలా రోజులైంది. అయితే ఇప్పుడు కృష్ణ భగవాన్ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. శ్రీ ముఖి హోస్టింగ్‌లో జాతి రత్నాలు అనే కొత్త షో ప్రారంభమైంది. ఈటీవీ ప్లస్‌లో ప్రతీ రోజూ రాత్రి తొమ్మిది గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది. మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో పోసాని, అన్నపూర్ణమ్మ, భద్రం, కృష్ణ భగవాన్ కనిపించారు.అయితే తాజాగా పోసాని కృష్ణమురళీ, హేమ, సమీర్, కృష్ణ భగవాన్ ఇలా అందరూ కలిసి సుమ క్యాష్ షోకు గెస్టులుగా వచ్చారు.
ఈ షోలో కృష్ణ భగవాన్ వేసే పంచ్‌లకు అందరూ పగలబడి నవ్వేశారు. అయితే సుమ అడిగిన ప్రశ్నలకు అన్నింటికి కూడా రఘుబాబే అని ఆన్సర్ చెబుతూ అందరినీ నవ్వించేశాడు. మీరు మీ లైఫ్‌లో చాలా ఆశ్చర్యానికి గురైన సందర్భాలున్నాయా? అని సుమ అడిగింది. రఘుబాబు, ఇంకో ఆవిడకు నంది అవార్డు రావడం అని కృష్ణ భగవాన్ సమాధానం ఇచ్చాడు.ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరైనా తొక్కేయాలని చూశారా? అని సుమ మరో ప్రశ్నను అడగగా. రఘుబాబే అని కృష్ణ భగవాన్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఎవరైనా ఒకరిని తుక్కు తుక్కు కొట్టమంటే ఎవరిని కొడతారు అని ఇంకో ప్రశ్న అడుగుతుంది సుమ. దీనికి కృష్ణ భగవాన్ ఆన్సర్ చెప్పేలోపే సమీర్ అందుకుని.. ఇంకెవరు రఘుబాబే అని కౌంటర్ వేస్తాడు. అలా మొత్తానికి ఆ రౌండ్ అంతా నవ్వులతో నిండిపోయింది. అన్నింటికి రఘబాబే కారణం అనడం వెనక ఏం ఉందోనని పలువురు చర్చించుకుంటున్నారు.