Manchu Manoj : శివయ్య క్షమించు.. కన్నప్ప టీంకి మంచు మనోజ్ క్షమాపణలు
ప్రధానాంశాలు:
Manchu Manoj : శివయ్య క్షమించు.. కన్నప్ప టీంకి మంచు మనోజ్ క్షమాపణలు
Manchu Manoj : గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ వివాదాలతో వార్తలలో నిలుస్తున్నారు. మంచు ఫ్యామిలీ ఇష్యూస్ రచ్చగా మారాయి. అయితే మనోజ్ భైరవం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఎమోషనల్ అయ్యాడు. తన స్పీచులో సినిమా కంటే పర్సనల్ మ్యాటర్‌లను ఎక్కువగా చెప్పాడు.ఆ కార్యక్రమంలో శివయ్యా అంటూ మనోజ్ కామెంట్ చేశాడు. శివయ్యా అని అలా పిలిస్తే కాదు.. మనసులో తల్చుకుంటే శివయ్య వస్తాడు అని విష్ణుకి, కన్నప్ప టీంకు కౌంటర్లు వేశాడు మనోజ్. అయితే తాజాగా విష్ణుకి, కన్నప్ప టీంకి మనోజ్ సారీ చెప్పాడు. సినిమా అంటే అందరి సమిష్టి కృషి అని, ఒక్కరి కోసం సినిమా మీద విమర్శలు చేయడం సరి కాదని మనోజ్ తెలుసుకున్నాడు.

Manchu Manoj : శివయ్య క్షమించు.. కన్నప్ప టీంకి మంచు మనోజ్ క్షమాపణలు
Manchu Manoj ఎమోషనల్ కామెంట్స్..
అలా శివయ్యా అని అనడం తప్పు.. కన్నప్ప టీంకు సారీ అని మనోజ్ రియలైజ్ అయ్యాడు.కన్నప్ప సినిమా అంటే ఒక్కరు కాదు.. అందులో ఎంతో మంది పని చేశారు.. మోహన్ లాల్ ఫ్యాన్స్ ఉన్నారు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఇలా అందరూ కష్టపడి సినిమాను చేస్తారు.. ఒక్కరికి కోసం సినిమాను విమర్శించ కూడదు.. కన్నప్ప కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అంటూ మనోజ్ కోరుకున్నాడు. ఇక ఇంట్లో జరిగిన గొడవల మీద కూడా మనోజ్ స్పందించాడు.
తాను ఎప్పుడూ కూడా తన తండ్రి సంపాదించిన ఆస్తుల్ని, ఆ డబ్బుల్ని కోరలేదని, తన నైజం కూడా అది కాదని అన్నాడు మనోజ్. అసలు అడిగే హక్కు నాకు లేదు.. అది ఆయన సొంతంగా కష్టపడి సంపాదించుకున్నది అంటూ మనోజ్ అన్నాడు. అయితే తన తండ్రి నేర్పించిన నీతి వైపు నిలబడటంతోనే ఈ సమస్యలు వచ్చాయని అంటున్నాడు. తన తండ్రిని కలిసి చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారని అన్నాడు. కుటుంబంలో ఒకరికి మాత్రమే తాను నచ్చలేదన్నాడు. తండ్రి మోహన్‌బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని, తన బిడ్డను అతని ఒడిలో పెట్టాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ అందరం రోజు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు.