Roja : రోజా మంత్రి కాకుండానే జబర్దస్త్ లో కనిపించకుండా పోవడంకు కారణం ఇదేనా?
Roja : ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునఃర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో తెలుగు బుల్లి తెరపై అత్యంత ఆసక్తికర పరిణామం జరగబోతుంది. దాదాపు దశాబ్ద కాలంగా ఈ టీవీ పై ప్రేక్షకుల నజర్ ఉంది అంటే అది కేవలం జబర్దస్త్ వల్లే అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ నుండి పుట్టుకొచ్చిన పలు కార్యక్రమాల వల్ల ఇప్పుడు ఈటీవీ నడుస్తోంది. అంతటి సూపర్ హిట్ జబర్దస్త్ కి గత పది సంవత్సరాలుగా జడ్జిగా రోజా వ్యవహరిస్తోంది. ఆమె మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ కనిపించక పోయినా మళ్ళీ ఆమె వచ్చి సందడి చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజా జబర్దస్త్ వదిలేస్తుంది అంటూ కొందరు అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఎమ్మెల్యేగా అయినా కూడా కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విషయంలో తగ్గేది ఇన్ని రోజులు కొనసాగుతూ వచ్చింది.
కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ నుండి దూరం అవుతుందని అంటున్నారు. దాంతో ఈ టీవీ లో అత్యంత కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్యే రోజా కు మంత్రి పదవి దాదాపుగా కన్ఫామ్ అయింది. కనుక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జబర్దస్త్ లో ఆమె కనిపించకపోవచ్చు అంటూ ప్రతి ఒక్కరు భావించారు కానీ ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అందుకు రెండు రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో గత రెండు వారాలుగా జబర్దస్త్ కామెడీ షో లో ఆమె కనిపించకపోవడం పై పలు రకాలు పుకార్లు వస్తున్నాయి.

mla roja disappear from etv mallemala jabardasth
మంత్రి కాకముందే ఎందుకు జబర్దస్త్ నుండి ఆమె తప్పుకుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే మంత్రివర్గ విస్తరణలో భాగంగా తనకు అవకాశం ఇవ్వాలి అంటూ లాబీయింగ్ నిర్వహించేందుకు ఎమ్మెల్యే రోజా పూర్తిగా అమరావతికి పరిమితమయ్యారు. జబర్దస్త్ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే ఈ సమయంలో ఎవరైనా తనపై లేనిపోనివి కల్పించి చెప్పి మంత్రివర్గం నుండి తప్పించే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె భావించి పూర్తిగా అమరావతి కే పరిమితం అయింది అంటూ కొందరు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జబర్దస్త్ ను వీడుతాను అంటూ ఆమె వైకాపా ముఖ్య నాయకులకు చెప్పే అవకాశాలు ఉన్నాయి.