Bigg Boss 6 Telugu : పెళ్లిని తప్పించుకోవడానికి బిగ్ బాస్ ఇంట్లోకి.. ఆ కంటెస్టెంట్‌ను ఇరుకున పెట్టిన నాగార్జున | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 6 Telugu : పెళ్లిని తప్పించుకోవడానికి బిగ్ బాస్ ఇంట్లోకి.. ఆ కంటెస్టెంట్‌ను ఇరుకున పెట్టిన నాగార్జున

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షో వస్తోందంటే.. బుల్లితెరపై కొత్త సందడి వస్తుంది. ఇక ఇప్పుడు బుల్లితెరపై ఎంత మంది చూస్తున్నారో.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో లైవ్‌లో అంత మంది చూస్తున్నారు. అలా ఎప్పుడు ఎక్కడున్నా కూడా అరచేతిలో బిగ్ బాస్ వినోదాన్ని అందుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఐదు సీజన్లు తెలుగు ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్ టీం. ఓటీటీలోనూ బిగ్ బాస్ షో సందడి చేసింది. ఇక ఇప్పుడు ఆరో […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 September 2022,2:31 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షో వస్తోందంటే.. బుల్లితెరపై కొత్త సందడి వస్తుంది. ఇక ఇప్పుడు బుల్లితెరపై ఎంత మంది చూస్తున్నారో.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో లైవ్‌లో అంత మంది చూస్తున్నారు. అలా ఎప్పుడు ఎక్కడున్నా కూడా అరచేతిలో బిగ్ బాస్ వినోదాన్ని అందుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఐదు సీజన్లు తెలుగు ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్ టీం. ఓటీటీలోనూ బిగ్ బాస్ షో సందడి చేసింది. ఇక ఇప్పుడు ఆరో సీజన్ ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ 4న సాయంత్రం ఆరు గంటలకు బిగ్ బాస్ షో ఆరో సీజన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా అదిరిపోయే ప్రోమోను వదిలారు..

ఇందులో కంటెస్టెంట్లను అలా చూపించీ చూపించుకుండా.. చూపించేశారు. డ్యాన్స్ పర్పామెన్స్‌లకు సంబంధించి అలా లైట్‌గా చూపించారు. ఓ కంటెస్టెంట్‌తో నాగ్ ఇలా అంటాడు. ఏంటి పెళ్లి తప్పించుకోవడానికి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చావా? అని అడుగుతాడు. సదరు కంటెస్టెంట్ అవునని సమాధానం ఇస్తుంది. ఆ కంటెస్టెంట్ ఎవరా? అనేది కాసేపట్లో తెలియనుంది. ఇక మరో కంటస్టెంట్‌ నాగార్జునను మాస్టారు అని పిలుస్తాను అని చెప్పింది. మా..కి.. స్టార్‌కి గ్యాప్ ఇవ్వు అని నాగార్జున అంటాడు.. మా స్టారు అని స్టార్ మాను బాగానే ప్రమోట్ చేశాడు నాగ్.

Nagarjuna Staires on Contestannts in Bigg Boss 6 Telugu Grand Promo

Nagarjuna Staires on Contestannts in Bigg Boss 6 Telugu Grand Promo

చలాకీ చంటి వాయిస్ క్లియర్‌గా వినిపించింది. సుమ్ము సుర్రైపోద్ది అని అంటాడు చంటి. ఇక సింగర్ రేవంత్‌ను మొదటి రోజే స్టేజ్ బుక్ చేయబోయాడు నాగార్జున. నువ్ మంచి పాటగాడివే కాకుండా.. ప్లే బాయ్ అని కూడా విన్నాను అని నాగార్జున అంటాడు. సర్ ఇంట్లో మా ఆవిడ చూస్తుంటుంది.. ఎందుకు సార్ అంటూ సింగర్ రేవంత్ అంటాడు. మొత్తానికి బిగ్ బాస్ ఆట మాత్రం ఈ సారి రసవత్తరంగానే ఉండేట్టు కనిపిస్తోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది