Nandamuri Taraka Ratna : ప్రపంచానికి తెలియని తారకరత్న లవ్ స్టోరీ ఇదే , మీ కంట్లో నీళ్ళు తిరగకపోతే అడగండి..!!

Advertisement

Nandamuri Taraka Ratna : హీరో నందమూరి తారకరత్న ఆరోగ్యం మరింత విషమంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం బెంగళూరులో నారాయణ హృదయాలయ హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్నారు. మనకు తెలిసిందే నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో లో కు మద్దతుగా తారకరత్న ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్దిసేపు నడవగానే తీవ్ర అస్వస్థకు గురై స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే సమీపంలోని కేసి ఆసుపత్రికి తరలించారు. అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

Nandamuri Taraka Ratna emotional love story
Nandamuri Taraka Ratna emotional love story

ఇకపోతే తారకరత వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన భార్య పేరు అలేఖ్య రెడ్డి. వీరిది ప్రేమ వివాహం. వీరిద్దరు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ తారకరత్న నా సోదరికి స్కూల్లో ఆమెకు సీనియర్. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్ల హైదరాబాదులో కలిసాం. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం. ఆ తర్వాత తారకరత్న నాకు ప్రపోజ్ చేశాడు. అయితే నేను పెద్దలతో మాట్లాడమని చెప్పాను. సినిమా ఇండస్ట్రీపై మాకు మంచి అభిప్రాయం లేకపోవడంతో మా పెద్దలు ఈ పెళ్ళికి అంగీకరించలేదు.

Advertisement
Nandamuri Taraka Ratna emotional love story
Nandamuri Taraka Ratna emotional love story

తారకరత్న ఇంట్లో కూడా నాకు విడాకులు అయిన కారణంగా మా పెళ్ళికి ఒప్పుకోలేదు అని అలేఖ్య చెప్పుకొచ్చారు. పైకి చాలా సింపుల్ గా కనిపించే తారకరత్న వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. ఆయన త్వరగా కోలుకొని, ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే తారకరత్న పర్యవేక్షించడానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆస్పత్రికి వచ్చారు. ఇక బాలకృష్ణ కూడా అక్కడే ఉండి తారకరత్న కి దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement