Shyam Singa Roy : లయన్ లాగా ఉన్నావ్ నాన్న.. నాని మీసం తిప్పిన తనయుడు..
Shyam Singa Roy : నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ ఫిల్మ్ ఈ నెల 24న విడుదల కానుంది. కోల్ కత్త బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం డెఫినెట్‌గా సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఇందులో హీరోయిన్స్‌గా సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ నటించారు. పిక్చర్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో హీరో హీరోయిన్స్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే హీరో నాని షేర్ చేసిన వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
క్రిస్మస్ కానుకగా నాని ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.ఈ సంగతి అలా ఉంచితే.. హీరో నాని ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. సదరు వీడియోలో నాని తన కొడుకు జున్నుతో హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నాని మీద పడుకుని ఉన్న తనయుడు నాని మీసాన్ని మెలి తిప్పుతున్నాడు. ఆ టైంలో నాని .. తన తనయుడిని తన పేరు ఏంటని అడగగా, జున్ను ఆసక్తికర సమాధానమిచ్చాడు.నాని మీసాలు సరి చేస్తూ…అలా చక్కగా సరి చేసుకుంటుంటే లయన్ లాగా ఉన్నావ్ నాన్న..అని జును అన్నాడు. ఇందుకు నాని అవునా అని రిప్లయి ఇచ్చాడు. నాని షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
Shyam Singa Roy : నానితో కొడుకు అల్లరి..
ఇకపోతే నాని ఈ చిత్రంలో ‘వాసు, శ్యామ్ సింగరాయ్’ రెండు పాత్రలను పోషించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. దేవదాసీ వ్యవస్థపై పోరాడే ‘శ్యామ్ సింగరాయ్’గా నాని యాక్టింగ్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘మైత్రేయి’ పాత్రలో సాయిపల్లవి నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలవబోతున్నది. దివంగత లిరిసిస్ట్, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రిఈ చిత్రంలో రెండు పాటలు రాశారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ అవుతోంది.
Lion la vunnavu Nanna ????#ShyamSinghaRoy pic.twitter.com/OwKZFzJXcL
— Nani (@NameisNani) December 20, 2021