Shyam Singha Roy : ‘శ్యామ్ సింగ రాయ్’ డైరెక్టర్‌కు క్షమాపణలు చెప్పిన సాయిపల్లవి.. ఎందుకో తెలుసా?
Shyam Singha Roy : కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన పీరియాడిక్ ఫిల్మ్ ‘శ్యామ్ సింగ రాయ్’ ఫిల్మ్ ఈ నెల 24న క్రిస్మస్ కానుకగా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అవబోతున్నది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ సభ్యులు ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. హీరో, హీరోయిన్స్, డైరెక్టర్ ప్రొడ్యూసర్.. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్ చేసింది.‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో ‘మైత్రేయి’ అనే దేవదాసి పాత్రను సాయిపల్లవి పోషించింది.
ఈ క్రమంలోనే పాత్ర కోసం ఎటువంటి హార్ట్ వర్క్ చేశారు, డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్ ఏంటనే ప్రశ్నకు సాయిపల్లవి ఆసక్తికర సమాధానం చెప్పింది. తాను సినిమా షూటింగ్ టైంలో మొదటి రెండు రోజులు ఇబ్బంది పడ్డానని, డైరెక్టర్ అనుకున్న దానికి తాను మ్యాచ్ చేయలేకపోయానని తెలిపింది. ఈ సందర్భంగా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్‌కు క్షమాపణలు చెప్పింది సాయిపల్లవి. అయితే, సీన్స్ షూట్ చేసే టైంలో తాను వేసే క్వశ్చన్స్‌కు ఆన్సర్స్ డైరెక్టర్ ఓపికగా చెప్పారని సాయిపల్లవి పేర్కొంది.ఈ క్రమంలోనే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ చాలా ఓపికగా తాను వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని సాయిపల్లవి వివరించింది.
Shyam Singha Roy : మొదటి రెండు రోజులు ఇబ్బంది పడ్డానన్న సాయిపల్లవి..
చాలెంజింగ్ రోల్ ప్లే చేయడంలో డైరెక్టర్ ఇన్‌పుట్స్ బాగా ఉపయోగపడ్డాయని , అయితే, మొదటి రెండు లేదా మూడు రోజులు కొంత ఇబ్బంది పడ్డానని, ఆ తర్వాత ట్రాక్‌లో పడ్డానని పేర్కొంది సాయిపల్లవి. ఇకపోతే సాయిపల్లవి రాత్రి 10 గంటల తర్వాత తక్కువ క్వశ్చన్స్ అడుగుతుందని, ఆ టైంలో తనకు షూట్ చాలా ఈజీ అయిపోతుందని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఫన్నీ వేలో కామెంట్ చేశారు. సాయిపల్లవి వేసే క్వశ్చన్స్ వలన తనకు పాత్రను ఇంకా పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ వివరించారు.