Poorna : పెళ్లి కళ వచ్చేసిందే పూర్ణ.. ట్రెడిషనల్ లుక్‌లో చించి ఆరేసిందిగా..!
Poorna : ఒకప్పుడు హీరోయిన్ పూర్ణ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కాని బుల్లితెర ద్వారా ఈ అమ్మడికి ఫుల్ పాపులారిటీ లభించింది. నరేష్ హీరో గా అంటించిన సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ..నటన పరంగా టూ గుడ్ అనిపించుకుంది. సినిమాలలో తన నటన పరంగా మంచి మార్కులే తెచ్చుకున్న పూర్ణ పెద్దగా హిట్స్ అందుకోకపోవడంతో చాలా వెనకపడింది. అయితే ఢీ షో ద్వారా పూర్ణకి పాపులారిటీ లభించింది. ఆ తర్వాత పలు టీవీ షోల ద్వారా పేరు తెచ్చుకుంది. ఇటు సినిమాల్లో నటిస్తూనే, అటు టెలివిజన్ షోలలోనూ మెరుస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో మహారాణిలా దర్శనమిచ్చింది.
తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ పూర్ణ దగ్గరగానే ఉంటుంది. తాజా ఫొటోషూట్లు చేస్తూ అందాల విందుతో ఖుషీ చేస్తుంటుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ నెట్టింట అడుగుపెట్టిందంటే ట్రెడిషనల్ వైబ్స్ రావాల్సిందే. తాజాగా పూర్ణ చేసిన ఫొటోషూట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. క్రీమ్ కలర్ పట్టుశారీలో అంతఃపుర మహారాణిలా పూర్ణ ఆహార్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రాణిలాగే స్టిల్స్ ఇవ్వడం ఆమె అభిమానులను ఫిదా చేస్తోంది. ఇలా అదిరిపోయే దుస్తుల్లో కనువిందు చేస్తోంది. పెళ్లి కళ వచ్చేసిందే పూర్ణ అంటూ నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పూర్ణ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
మలయాళీ అందం పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఇక ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయారు. ఇటీవల పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. అందులో భాగంగా ’సిల్లీ ఫెలోస్’ ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక ఇటీవల పూర్ణ, అసిఫ్ అలీ ఎంగేజ్‌మెంట్ కేరళలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించి పూర్ణ కొన్ని ఫోటోలను, ఓ వీడియోను పంచుకున్నారు.త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తుంది.