Garikipati : అనుష్కను చూస్తుండిపోయానన్న గరికిపాటి.. ఆర్జీవీ కౌంటర్ మాములుగా లేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garikipati : అనుష్కను చూస్తుండిపోయానన్న గరికిపాటి.. ఆర్జీవీ కౌంటర్ మాములుగా లేదుగా..!

 Authored By mallesh | The Telugu News | Updated on :13 October 2022,6:00 pm

Garikipati : ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రోలింగ్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైనా చిన్న తప్పు చేసి దొరికితే వారిని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అందులో హీరోహీరోయిన్లే కాదు. వారి కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదు నెటిజన్లు. మొన్నటివరకు మంచు ఫ్యామిలీని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇక నిన్న సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడకును హీరోగా లాంచ్ చేయడంతో అతన్ని కూడా ఓ ఆట ఆడుకున్నారు. తాజాగా మెగాఫ్యాన్స్ గరికపాటి నరసింహరావును ఆడుకుంటున్నారు. ఇందులోకి ఆర్జీవి కూడా వచ్చిచేరాడు. ప్రతిరోజూ ఉదయాన్నే టీవీల్లో ప్రపచనాలు చెబుతూ పేరు సంపాదించకున్న గరికపాటి నరసింహరావు గురించి తెలియని వారుండరు.

ఆయన ఉన్నది ఉన్నట్టు చెబుతుంటారు. హిందూ ధర్మం ప్రకారం మగవారు, ఆడవారు, కుటుంబంలోని వారంతా ఎలా నడుచుకోవాలో చెబుతుంటారు. శాస్త్రాల గురించి మంచి పట్టున్న వ్యక్తి. ఈయన ఇటీవల దసరా వేడుకల్లో భాగంగా హర్యానా గవర్నర్ నిర్వహించిన అలయ్ భలయ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక అదే సమయంలో ఆయన మాట్లాడుతుండగా అక్కడకు మెగాస్టార్ చిరంజీవి రావడం, జనాలంతా ఆయనతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించడం గరికపాటికి రుచించలేదు. వెంటనే మైకులో గట్టిగా చిరంజీవి గారు ఫోటో సెషన్ ఆపకపోతే నేను లేచి వెళ్లిపోతానని అనడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

Ram Gopal Varma counter on Garikapati Narasimha Rao

Ram Gopal Varma counter on Garikapati Narasimha Rao

Garikipati : అనుష్కను చూసి టెంప్ట్ అయ్యాడట..

తమ అభిమాన నటుడినే అవమానిస్తావా? అంటూ ఫైర్ అయ్యారు ఫ్యాన్స్. నాగబాబు మధ్యలో కల్పించుకుని వదిలేయాలని, ఆయన్ను ఏమనద్దని ఫ్యాన్స్‌కు సూచించారు. మొన్నటివరకు సైలెంట్‌గా ఉన్న వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి వెంటనే రంగంలోకి దిగాడు.నాగబాబు ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ గరికిపాటిని గడ్డిపరక అంటూ కామెంట్స్ చేశాడు. తాజాగా గతంలో గరికపాటి అనుష్క గురించి మాట్లాడిన ఒక వీడియోను షేర్ చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశాడు. ‘తన కొడకు పేపర్‌లో అనుష్కను చూస్తున్న టైంలో తాను ఒక్కసారి చూసి అలానే చూస్తూ ఉండిపోయానని అనడంతో.. ‘ఓహో, ఆహా,అడ్డడడ్డడే.. ఓహో మీరు కూడానా (గ‌రిక) బ‌లి (పాటి) గారూ!’ అంటూ వ్యంగ్యంగా ఆర్జీవీ కామెంట్ చేశాడు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది