Ram pothineni : స్టార్ హీరోయిన్ ప్రేమలో రామ్ పోతినేని .. పెళ్లికి కూడా రెడీ..!
Ram pothineni : మన టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది హీరోలు హీరోయిన్లను భార్యలుగా చేసుకున్నారు. నాగ చైతన్య, నాగార్జున, రాజశేఖర్ లాంటి హీరోలు హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లో తక్కువే కానీ బాలీవుడ్ లో అయితే ఎన్నో ఏళ్ల నుంచి హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం ఆనవాయితిగా వస్తుంది. అయితే త్వరలోనే టాలీవుడ్ లో కూడా అలాంటి సూచనలే కనిపిస్తున్నాయి. యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని, ఆమెతో ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నాడని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రామ్ చేసుకోబోయే హీరోయిన్ మరెవరో కాదు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మీడియా కథనం ప్రకారం రామ్, అనుపమ ఎప్పటినుంచో రిలేషన్షిప్ లో ఉన్నారట. వీరు కుటుంబాలు కూడా వీరి ప్రేమ పెళ్లికి అంగీకరించారట. త్వరలోనే పెళ్లి ప్రకటన రాబోతుందని న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రామ్ అనుపమ కలిసి ఉన్నది ఒకటే జిందగీ , హలో గురు ప్రేమకోసమే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. అది కాస్త ఇలా ప్రేమకు దారి తీసిందట. ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
ఈ వార్తలపై రామ్, అనుపమ స్పందించాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు. ఇకపోతే రామ్ ఇటీవల ‘ స్కంధ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. అయితే కొందరు సినిమా సూపర్ గా ఉంది అంటే మరి కొందరు రొటీన్ గా ఉంది అని చెప్పుకొస్తున్నారు. అయితే రామ్ మాత్రం మాస్ హీరోగా నిరూపించుకున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటించబోతున్నారు. ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తున్నట్లు తెలుస్తోంది.