Roja : తిరుమలలో రోజా హల్‌చల్.. అనుచరులతో కలిసి ..
Roja : సినీ నటి రోజా కొద్ది రోజుల క్రితం మంత్రి ప్రమోషన్ అందుకున్న విషయం తెలిసిందే. మంత్రిగా పదవీ బాధ్యతలు అందుకున్న తర్వాత తెగ సందడి చేస్తుంది. అయితే ఇటీవల వైసీపీ మంత్రులు తిరుమల కొండపై ప్రవర్తించిన తీరుతో హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పుడు వారి జాబితాలో రోజా చేరింది. ఇటీవల వరుసగా మంత్రులు అప్పలరాజు.. ఉషశ్రీ చరణ్ భక్తుల రద్దీ సమయంలో తమ అనుచరులతో కలిసి ప్రోటోకాల్ – వీఐపీ దర్శనాల తీరు వివాదాస్పదమైంది. ఆగస్టు 15న మంత్రి ఉషశ్రీ చరణ్ తన నియోకవర్గానికి చెందిన వారితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు.
Roja : రోజా తిప్పలు..
ఈ సమయంలో కొండ మొత్తం భక్తులతో రద్దీగా ఉంది. దర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది. అయినా..తన అనుచరగణానికి మంత్రి దర్శనంలో ప్రాధాన్యత దక్కేలా పవర్ చూపించారు. ఇక, ఇప్పుడు మరో మంత్రి రోజా సైతం ఇటువంటి విమర్శలకే కారణమయ్యారు. పెళ్లిళ్ల సీజన్ ..సెలవులు ఎక్కవగా ఉండటంతో భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంది. ఈ నెల 21వ తేదీ వరకు అన్ని బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ సిఫారసులను కూడా రద్దు చేసింది. అయితే, ఈ నిబంధనలను పక్కనపెట్టి మంత్రి రోజా ఈరోజు 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం చేయించారు.
దీంతో గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. రోజా తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి బ్రేక్ దర్శనం చేయించారని మండిపడుతున్నారు. తాము గంటల తరబడి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి చూస్తుంటే మంత్రితో వచ్చిన అనుచరులకు ఎలా ప్రాధాన్యత ఇస్తారంటూ మండిపడుతున్నారు. కానీ, మంత్రి రోజా దీని పైన స్పందించారు. చెప్పుకుంటే బాధ అంటూ టీటీడీపై ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయాన్ని గౌరవించాలి కనుక… తన నియోజకవర్గ ప్రజలకు దర్శనం అయ్యే వరకు ఆలయంలోనే ఉన్నానని మంత్రి రోజా చెప్పారు.