Roja – Alia Bhatt : రోజాకి, ఆలియా భట్ కి మధ్య ఉన్న సంబంధం గురించి మీకు తెలుసా?
Roja – Alia Bhatt : తెలుగు సినిమా చరిత్రలో తనదైన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నటి రోజా. హీరోయిన్‌గా స్టార్ హీరోలందరి సరసన నటించిన రోజా పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లితెరపై సందడి చేసింది. టీవీ షోలోకు జడ్జిగా వ్యహరిస్తూ నానా రచ్చ చేసింది. ముఖ్యంగా జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. రోజా మంత్రిగా ప్రమోషన్ అందుకున్న తర్వాత జబర్ధస్త్ నుండి కూడా దూరమైంది. రాజకీయాలలోనే యాక్టివ్‌గా ఉంటూ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతుంది.
Roja – Alia Bhatt : అసలు విషయం ఇది…!
తెలుగు , తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన రోజా.. కన్నడ, మలయాళంలో ఓ మోస్తరు చిత్రాల్లో నటించి మెప్పించింది రోజా. తెలుగు ‘ప్రేమ తపస్సు’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. సర్పయాగం సినిమాతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలయ్యతో నటించిన ‘భైరవ ద్వీపం’తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది . విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ పాత్రలతో అలరించింది రోజా. ఇక హీరోయిన్‌గా ఫేడౌట్ అయ్యాకా.. రోజా.. తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఆ తర్వాత వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా తొలిసారి ఏపీ శాసనసభలో అడుగుపెట్టారు.
దాదాపు మూడు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో సౌత్ చిత్రాల్లో నటించిన రోజా.. తన కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క హిందీ చిత్రంలో నటించింది. ఇక రోజా హిందీ చిత్ర విషయానికొస్తే.. ఈమె హిందీలో ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా నటించిన ‘ది జెంటిల్మెన్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసింది రోజా. అంతకు ముందు రోజా.. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘రక్షణ’ సినిమాలో ఓ ఐటెం పాటలో మెరిసింది. ఆ తర్వాత ‘హలో బ్రదర్’లో కూడా ఓ పాటలో మెరిసింది. మొత్తంగా హిందీలో రోజా నటించిన ఏకైక చిత్రంగా ‘ది జెంటిల్మెన్’ సినిమా నిలిచిపోయింది. ఈ రకంగా ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్.. తండ్రి మహేష్ భట్‌తో రోజాది.. ఒక దర్శకుడు, నటికున్న రిలేషన్ మాత్రమే .