Jabardasth Naresh : అందరి ముందే విషయం బయటపెట్టేసిన రోజా.. సిగ్గుతో తలవంచుకున్న నరేష్
Jabardasth Naresh : జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన వారిలో నరేష్ ఒకరు. చూడ్డానికి చిన్న పిల్లాడిలా కనిపించిన అతడి వేసే పంచ్‌లు హై రేంజ్‌లో ఉంటాయి. వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లోని అనంతపురం అనే ఊళ్లో పుట్టిన నరేష్.. చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో బాధ పడుతున్నాడు. కానీ అదే అతడికి వరమైంది కూడా. పదేళ్ల పిల్లాడిలా కనిపిస్తుంటాడు కానీ నరేష్ వయసు మాత్రం 22 ఏళ్లు అంటే నమ్మడం కాస్త కష్టమే. 2000 సంవత్సరంలో పుట్టిన నరేష్.. ఢీ షో జూనియర్స్‌కు వచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయటే తిరుగుతుంటే సునామీ సుధాకర్ చూసి చంటి టీంలో జాయిన్ చేసాడు.
ఆ టీం నుంచి బుల్లెట్ భాస్కర్ టీంలోకి వచ్చిన తర్వాత నరేష్ జాతకం మారిపోయింది.జబర్దస్త్ కోసం అంతా స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు.. కానీ నరేష్ మాత్రం చేయడు. స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఏంటి అనేది మాత్రమే గుర్తు పెట్టుకుని స్టేజ్‌పైనే పర్ఫార్మ్ చేస్తుంటాడు నరేష్. అతని వలన మా టీంకి మంచి పేరు వచ్చిందని చాలా సార్లు చెబుతుంటాడు భాస్కర్. ఇప్పటికీ నరేష్ తనదైన హాస్యంతో నవ్విస్తుంటాడు. తాజాగా ఆయన ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో వేసిన ఓ అమ్మాయితో డ్యాన్స్ చేస్తుండగా, రోజాతుస్సుమనిపించింది. చంక ఎక్కి కూర్చొన్న నరేష్‌ని చూసి అతడికి 10 ఏళ్లు అనుకుంటున్నారా

roja satires on Jabardasth Naresh
Jabardasth Naresh : నరేషా, మజాకానా.!
ఆయనకు 24 ఏళ్లు అనే సరికి అందరు తెగ పగలబడి నవ్వారు.నేను నమ్మడం లేదు అని ఆమని అడగ్గా, అందుకు స్పందించిన రోజా మీరు కూడా చంక ఎక్కించుకోండని పంచ్ వేస్తుంది. అయితే నరేష్‌కి అంత వయస్సు అంటే ఎవరికి నమ్మబుద్ది కావడం లేదు. ఒక్క టీం అనకుండా అందరి టీంలలో కనిపిస్తుంటాడు నరేష్. జబర్దస్త్ షోలోకి వచ్చిన తర్వాత సొంతూళ్లో ఇల్లు కూడా కట్టుకున్నాడు ఈయన. సిటీలో కూడా ఫ్లాట్ తీసుకున్నాడు. మొత్తానికి బుడ్డోడిలా కనిపిస్తాడు కానీ బుల్డోజర్ మాదిరి పంచ్ డైలాగులు పేలుస్తూ నవ్విస్తున్నాడు నరేష్.