Roja : జబర్దస్త్ కమెడియన్ చెంప చెల్లుమనిపించింది.. అది దించురా అంటూ రోజా ఫైర్

Advertisement

Roja : అదేంటో.. ఈ మధ్యకాలంలో వస్తున్న షోస్, అందులో చూపెడుతున్న సన్నివేశాలు ఓ రేంజ్ కిక్కిస్తున్నాయి. ఇంతకీ నిజామా? లేక టీఆర్ఫీ కోసం ఇలా ప్లాన్ చేశారా అనేది సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాకుండా సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇక స్పెషల్ ఈవెంట్స్‌లో ఇలాంటి సీన్స్‌కి కొదవే లేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ దసరా రోజు ఓ స్పెషల్ షో ప్లాన్ చేసి అందులో రోజాను బాగా హైలైట్ చేశారు.

Roja Slaps emmanuel in Dasara Bullollu Latest Promo
Roja Slaps emmanuel in Dasara Bullollu Latest Promo

‘దసరా బుల్లోళ్ళు’ అంటూ జబర్దస్త్ బ్యాచ్ అందరితో ఓ ప్రత్యేకమైన ప్రోగ్రాం షూట్ చేశారు. ఈ షో అక్టోబర్ 15న ప్రసారం కానున్న నేపథ్యంలో ప్రోమో వీడియో రిలీజ్ చేసి అందులోని సన్నివేశాలతో ఊహించని షాకిచ్చారు. ఈ వీడియోలో జబర్దస్త్ కమెడియన్ అయిన ఇమ్మాన్యుయేల్ చెంప చెల్లుమనిపించింది రోజా. అంతటితో ఆగక ‘దించురా చేయి’ అంటూ ఇమ్మూపై గరం గరం అయింది.

Advertisement

Roja : లాగి పెట్టి కొట్టిన రోజా..

Roja Slaps emmanuel in Dasara Bullollu Latest Promo
Roja Slaps emmanuel in Dasara Bullollu Latest Promo

అయితే దీనంతటికీ కారణం మాత్రం వర్ష. అదేనండీ వర్ష- ఇమ్మాన్యుయేల్ మధ్య ఎఫైర్ ఉందని ఎప్పటినుంచో వింటున్నాం కదా. అయితే ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ మరో అమ్మాయిని వెంట పెట్టుకొచ్చాడు. ఇది చూసి కోపంతో రాజా దగ్గర ఫిర్యాదు చేసింది వర్ష. దీంతో రోజా పిలిచి అడుగుతుండగా.. ‘నాకిష్టమైన వాళ్ళతో నేనుంటా.. అయితే ఏంటి ఇప్పుడు?’ అని మీద మీదకు పోయాడు ఇమ్మూ. ఇక రోజాకు ఆవేశం ఆగక ఇమ్మాన్యుయేల్ చెంప చెళ్లుమనిపించింది. ప్రోమో వీడియోలో ఈ ఇంట్రెస్టింగ్ సీన్ చూసి అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement