Samantha Injured : సమంత ఫ్యాన్స్ కి షాకింగ్.. కాలితో దెబ్బలు ఏం జరిగింది అంటే..!
Samantha Injured : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. కాలికి సూదులతో ఆక్యుపెంచర్ థెరపీ చేయించుకుంటున్న ఫోటో షేర్ చేసి దెబ్బలు తగలకుండా నేను యాక్షన్ స్టార్ ని అవ్వలేనా అని కామెంట్ పెట్టింది. ఇంతకీ సమంతకు ఏమైంది అంటే ప్రస్తుతం సమంత చేస్తున్న యాక్షన్ పార్ట్ షూటింగ్ లో ఆమె కాలికి గాయమైనట్టు తెలుస్తుంది. దాని ట్రీట్ మెంట్ కోసం ఆమె శ్రమ పడుతుంది. ఐతే దెబ్బలు తగలకుండా […]
ప్రధానాంశాలు:
Samantha Injured : సమంత ఫ్యాన్స్ కి షాకింగ్.. కాలితో దెబ్బలు ఏం జరిగింది అంటే..!
Samantha Injured : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. కాలికి సూదులతో ఆక్యుపెంచర్ థెరపీ చేయించుకుంటున్న ఫోటో షేర్ చేసి దెబ్బలు తగలకుండా నేను యాక్షన్ స్టార్ ని అవ్వలేనా అని కామెంట్ పెట్టింది. ఇంతకీ సమంతకు ఏమైంది అంటే ప్రస్తుతం సమంత చేస్తున్న యాక్షన్ పార్ట్ షూటింగ్ లో ఆమె కాలికి గాయమైనట్టు తెలుస్తుంది. దాని ట్రీట్ మెంట్ కోసం ఆమె శ్రమ పడుతుంది. ఐతే దెబ్బలు తగలకుండా యాక్షన్ పార్ట్ షూట్ చేయలేకపోతున్నందుకు సమంత బాధపడుతుంది.
సమంత ఇప్పటికే చాలా రకాల వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతూ వచ్చింది. ఆమె చేసే సినిమాలేమో కానీ ఆమె హెల్త్ కండీషన్ సరిగా ఉండట్లేదు. మొన్నటిదాకా సమంత మయోసైటిస్ వల్ల బాధపడింది. ఈమధ్యనే దాని నుంచి పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు మరోసారి సమంత ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ దెబ్బలతో కనిపించింది. సినిమా కోసం సమంత డెడికేషన్ తెలిసిందే అందులో భాగంగానే యాక్షన్ స్టార్ అవ్వాలని ఆమె కాలుకి గాయం అయ్యేలా చేసుకుంది.
Samantha Injured సమంత సిటాడెల్ తో పాటుగా..
ప్రస్తుతం సమంత సిటాడెల్ వెబ్ సీరీస్ లో నటిస్తుంది. దీనితో పాటుగా ఆమె నిర్మాతగా మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. తను చేసే ఎలాంటి పాత్రలో అయినా 100కి 100 శాతం ఇచ్చే సమంత తన పాత్రలో పూర్తి స్థాయి పర్ఫెక్షన్ కనబరచాలని అనుకుంటుంది. అందుకే అమ్మడు చేసే ప్రతి సినిమాలో ఆమె పనితనం కనిపిస్తుంది. ఐతే ప్రస్తుతం చేస్తున్న సినిమాలో యాక్షన్ పార్ట్ కోసం కష్టపడుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె కాలికి గాయమైంది.
సమంత మోకాలు గాయం గురించి తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సమంత కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని కామెంట్స్ పెడుతున్నారు. విజయ్ దేవరకొండతో ఖుషి తర్వాత సమంత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. ఐతే అమ్మడు మాత్రం హిందీ పరిశ్రమ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలని చూస్తుంది. సమంత అక్కడ రాణించాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది.