Shruti Haasan : ఈ చిన్నారి.. ఇప్పుడు అంత పెద్ద స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?
Shruti Haasan : ఒకప్పటితో పోల్చితే ఇప్పటి పరిస్థితులు చాలా మారిపోయిన సంగతి అందరికీ విదితమే. ఒకప్పుడు సెలబ్రిటీలు ఫ్యాన్స్‌తో ముచ్చటించే పరిస్థితులు కొంత తక్కువగానే ఉండేవి. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం తమకు నచ్చిన విషయాలను పంచుకుంటున్నారు. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవిత విశేషాలను, విషయాలను పంచుకుంటూ..ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే థ్రో బ్యాక్ పిక్చర్స్ అంటూ తమ చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన బాల్య ఫొటోను షేర్ చేసింది.
అది ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.‘త్రో బ్యాక్’ పిక్స్ షేరింగ్ అనేది ఇటీవల కాలంలో ఓ ట్రెండయింది. ఈ క్రమంలోనే తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా స్టార్ హీరోయిన్ తన చిన్ననాటి ఫొటో షేర్ చేసింది. ఆమెనే లోక నాయకుడు కమల్ హాసన్ కూతురు శృతిహాసన్. ఈ రోజు అనగా జనవరి 28.. తన జన్మదినం .. ఈ సందర్భంగా ఆమె తన చిన్ననాటి ఫొటో సోషల్ మీడియాలో పంచుకుంది. అది చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంత అమాయకమైన అమ్మాయి ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.తెలుగులో టాప్ హీరోలు అందరితో నటించిన శ్రుతిహాసన్.. ఇప్పుడు పలు ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉంది.

shruti haasan this star heroine photo viral in social media
Shruti Haasan : ఇప్పుడు అదొక ట్రెండ్.. అందులో భాగమైన స్టార్ హీరోయిన్..
మల్టీ టాలెంటెడ్ శ్రుతిహాసన్.. తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హే రామ్’ చిత్రంలో బాలనటిగా కనిపించింది. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన శ్రుతిహాసన్ కు.. తెలుగులో హీరోయిన్ గా మంచి పేరు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘గబ్బర్ సింగ్’తో శ్రుతి హాసన్.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. గతేడాది ఈ భామ ఆయనతో కలిసి నటించిన ‘వకీల్ సాబ్ ’రిలీజ్ అయి సక్సెస్ అయింది కూడా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న శ్రుతిహాసన్.. సింగర్ గానూ రాణిస్తోంది.