Sreeja Konidela : మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందంటున్న శ్రీజ…. ఇన్ డైరెక్ట్ గా ఇది అతనికేనా…
Sreeja Konidela : మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీజ ఏ పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీజ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన స్పెషల్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.అయితే శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకుల వ్యవహారం మీద ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఈ ఇద్దరూ విడిపోయారని లెక్కలేనన్ని వార్తలు వస్తుంటాయి. కానీ ఇంత వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
శ్రీజ కళ్యాణ్‌గా ఉన్న ఇన్ స్టా హ్యాండిల్ పేరుని శ్రీజ కొణిదెలగా మార్చుకుంది శ్రీజ. దీంతో ఈ విడాకుల రూమర్లు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారం పై ఇరు కుంటుంబ సభ్యులు ఇంతవరకు స్పందించలేదు.కాగా మరో వైపు కళ్యాణ్ దేవ్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గ ఉండడు. కాకపోతే తన కూతురు, తన సినిమాలకు సంబంధించిన పోస్ట్ లు పెడుతుంటారు. అయితే కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆయన సినిమాలను మెగా ఫ్యామిలీ పట్టించుకోవట్లేదని టాక్.
దీంతో ఈ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. అయితే శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లు మాత్రం నవిష్కకు సంబంధించిన పోస్టులు పెడుతుంటారు.తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీజ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మనం అవతలి వ్యక్తికి మనస్పూర్తిగా ఏదైతే ఇస్తామో.. అదే మనకు వంద రెట్లు తిరిగి వస్తుంది అంటూ ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. దీంతో శ్రీజ ఎవరి గురించి ఈ కామెంట్స్ చేసిందో.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు.