Sreemukhi : లాంగ్ ఫ్రాగ్‌లో.. కొంటెచూపులతో అదరగొడుతున్న శ్రీముఖి..
Sreemukhi : బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ‘రాములమ్మ’గా ఫన్నీ స్టెప్ప్ వేస్తూ చలాకీగా ఉంటూ ‘కామెడి స్టార్స్, జీ మహోత్సవం’తోపాటు పలు షోస్ మధ్యలో పంచ్‌లు వేస్తూ ప్రేక్షకులను నవ్వించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతోంది ముద్దుగుమ్మ శ్రీముఖి. ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గానే ఉంటుంది.
శ్రీముఖి యాంకర్‌గా పలు షోస్‌కు వ్యవహరిస్తూనే సినిమా ఫంక్షన్స్‌లోనూ పాల్గొంటుంది. ఇటీవల ‘దసరా దోస్తి’ పేరిట జీ తెలుగు వారు నిర్వహించిన కార్యక్రమలో శ్రీముఖి పార్టిసిపేట్ చేసింది. ఈ సందర్భంగా దసరా దోస్తి కోసం ప్రియాంక సహజనంద స్టైల్ చేసిన ఫొటోలను శ్రీముఖి ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sreemukhi : వెల్లవిరిసిన సంప్రదాయ సౌరభం..
ఇకపోతే ఫొటోల్లో శ్రీముఖి చాలా క్యూట్‌గా ఉంది. మల్టీకలర్ లాంగ్ ఫ్రాగ్, తగు ఆభరణాలు ధరించి ఫొటోలకు ఫోజులిస్తూ హోయలు పోయింది శ్రీముఖి. సంప్రదాయ వస్త్రాల్లో తెలుగింటి ఆడబిడ్డలా మెరిసిపోతోంది శ్రీముఖి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘బ్యూటిఫుల్ గర్ల్, చాలా బాగున్నారు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ ప్రజెన్స్ విషయానికొస్తే..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ‘జులాయి’ చిత్రంతో వెండితెరపై మెరిసన శ్రీముఖి.. అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూనే ఉంది. ఇటీవల శ్రీముఖి హీరోయిన్‌గా నటించిన ‘క్రేజీ అంకుల్స్’ సినిమా విడుదలైంది. దాంతో పాటు శ్రీముఖి ఓ కీలక పాత్ర పోషించిన నితిన్ ‘మాస్ట్రో’ ఫిల్మ్ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్‌లో రిలీజ్ అయింది.