Sudigali Suheeer : రోజా పేరు ఎత్తగానే లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను
Sudigali Suheeer : జబర్దస్త్ కారణంగా ప్రస్తుతం ఎంతో మంది స్టార్స్ అయ్యారు. వారు వీరు అని కాకుండా చాలా మందికి జబర్దస్త్ జీవితాన్ని ఇచ్చింది. అందుకే చాలా మంది జబర్దస్త్ లో వస్తున్న పారితోషికం కంటే రెట్టింపు పారితోషికం వచ్చినా కూడా బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించరు. ఏదైనా వివాదం జరిగితే తప్ప ఏ ఒక్కరు కూడా జబర్దస్త్ ను వీడేందుకు సిద్దం అవ్వరు. జబర్దస్త్ ను రోజా వీడారు. ఆమె ఏపీ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న కారణంగా జబర్దస్త్ జడ్జ్ ప్లేస్ కు గుడ్ బై చెప్పేసిన విషయం తెల్సిందే.
తాజాగా రోజా కు వీడ్కోలు పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో రోజా ఎమోషనల్ అయ్యింది. ఆమెతో పాటు రోహిణి మరియు రష్మి గౌతమ్ ఇంకా పలువురు కూడా కన్నీరు పెట్టుకున్నారు. జబర్దస్త్ వేదిక నుండే ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యాను… మంత్రి పదవి కూడా అయ్యాను అంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె తన జ్ఞాపకాలను నెమరవేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో సుధీర్ మరియు గెటప్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వారు రోజా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

sudigali suheeer and sreenu emotional about roja good bye to jabardast
సుధీర్ మరియు శ్రీను లు మాట్లాడుతూ రోజా తో తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. వారిద్దరు కూడా మాటల మద్యలో కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ముఖ్యంగా గెటప్ శ్రీను కి రోజా తో చాలా సన్నిహిత్యం ఉంది. అమ్మా అమ్మా అంటూ శ్రీను చాలా సుదీర్ఘ కాలంగా అభిమానం కలిగి ఉన్నాడు. ఇక సుడిగాలి సుధీర్ మరియు రోజాకు ఉన్న సన్నిహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరి మద్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే సుధీర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.