Tollywood : టాలీవుడ్‌లో కుర్ర హీరోయిన్‌ల హడావుడి.. ఇక స్టార్ హీరోయిన్స్ సర్ధుకోవాల్సిందే..?
Tollywood : టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్స్ హడావిడి ఈ మధ్య బాగా ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా కొత్తవారు రావడం పాతవారు పోవడం సహజంగా జరిగే విషయమే. పెద్దవాళ్ళు సామెత చెప్పిన విధంగా కొత్త నీరు రావాలంటే పాత నీరో పోవాల్సిందే. ఇది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఈ వ్యవహారం సర్వ సాధారణం.
ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా క్రేజ్ ఉన్నంతవరకు..వారికి పోటీగా టాలెంటెడ్ యంగ్ హీరోయిన్స్ వచ్చే వరకే. సావిత్రి, సౌందర్య ల మాదిరిగా ఏళ్లతరబడి ఇండస్ట్రీని ఏలుతూ దర్శక, నిర్మాతలకు అందుబాటులో ఉంటూ వందేసి సినిమాలు చేసే రోజులు ఇప్పుడు లేవు. ముంబై నుంచి వచ్చామా పట్టుమని ఓ పది సినిమాలు చేశామా.. కాస్త క్రేజ్ తగ్గగానే సర్దేసుకొని వెళ్ళామా..అదే దాదాపుగా ఇప్పుడు కనిపిస్తోంది.
Tollywood : పూజా హెగ్డే, రష్మిక మందన్నలకి గట్టీ పోటీ టాలీవుడ్ లో ఏర్పడింది.
ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న పేర్లు పూజా హెగ్డే, రష్మిక మందన్న. ఆ తర్వాత కీర్తి సురేష్. అయితే టాలీవుడ్‌లో గానీ బాలీవుడ్‌లో గాని వరసగా అవకాశాలు అందుకుంటున్న పూజా హెగ్డే, రష్మిక మందన్నలకి గట్టీ పోటీ టాలీవుడ్ లో ఏర్పడింది. ఏకంగా నలుగురైదుగురు కుర్ర భామలు వీళ్ళకి పోటీగా దిగారు. కృతిశెట్టి ఉప్పెన అన్న ఒకే ఒక్క సినిమాతో చాలామందికి హీరోయిన్స్ ని గడగడలాడిస్తోంది. సరిగ్గా 18 ఏళ్ళు కూడా లేని కృతిశెట్టి ఉప్పెన సినిమా తర్వాత టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది.
అలాగే తెలుగమ్మాయి రీతువర్మ టాలీవుడ్ కి వచ్చి చాలాకాలం అయినా ఈ మధ్య వరసగా సినిమా అవకాశాలు అందుకుంటూ ఫాంలోకి వచ్చింది. గ్యాంగ్ లీడ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ కూడా మంచి సినిమాలు చేస్తోంది. ఫిదా సినిమాతో నేచురల్ పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి.. పూజా హెగ్డే, రష్మిక మందన్న రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ప్రస్తుతం సాయి పల్లవి, కృతిశెట్టి డేట్స్ దొరకడం చాలా కష్టం అయింది.
Tollywood : స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న వాళ్ళకి రానున్న రోజుల్లో అవకాశాలు కష్టమే
ఇక రొమాంటిక్ సినిమాతో వస్తున్న కేతికశర్మ, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్, నాని సినిమాతో టాలీవుడ్ కి వస్తున్న నజ్రియా లాంటి వాళ్ల క్రేజ్ బాగానే ఉంది. పైగా రెమ్యూనరేషన్ కూడా తక్కువ. అందుకే స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న వాళ్ళకి రానున్న రోజుల్లో అవకాశాలు కష్టమే అంటున్నారు. చూడాలి మరి వీరిలో ఎంతమంది స్టార్ స్టేటస్ అందుకుంటారో.. ఎంతమంది ఒక్క సినిమాతో సర్ధేసుకుంటారో.