Venu Swamy : క్షమాపణలు చెప్పిన వేణు స్వామి..!
ప్రధానాంశాలు:
Venu Swamy : క్షమాపణలు చెప్పిన వేణు స్వామి..!
Venu Swamy : ఇటీవల వేణు స్వామి సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. naga chaitanya నాగ చైతన్య, శోభిత ధూళిపాళ sobhita dhulipala వైవాహిక జీవితంపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చేయగా, దానిపై సమాధానం చెప్పాలని, నిశ్చితార్ధం చేసుకున్న మహిళను కించపరిచేలా, అవమానించేలా ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది.
Venu Swamy తగ్గిన వేణు స్వామి..
వేణు స్వామి Venu Swamy జ్యోషంపై అక్కినేని అభిమానులతో పాటు, మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని Social Media సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. వేణు స్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ ఫిర్యాదు చేశారు. దీంతో వేణు స్వామికి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
అయితే నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లారు వేణు స్వామి. ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో నేడు మహిళా కమిషన్ కు క్షమాపణలు చెప్పి మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనన్నాడు వేణు స్వామి.సెలబ్రేటీల జీవితాల గురించి జ్యోతిష్యం చెబుతూ వేణుస్వామి విమర్శల పాలయ్యారు. గతంలో అక్కినేని హీరో నాగ చైతన్య, naga chaitanya స్టార్ హీరోయిన్ సమంత Samantha ప్రేమ పెళ్లి చేసుకున్న విడిపోతారని ఆయన జ్యోతిష్యం చెప్పిన విషయం తెలిసిందే.