Jabardasth : జబర్దస్త్ దేవుడు – చమ్మక్ చంద్ర.. సుధీర్.. ఆది.. ఆ తర్వాత ఎవరు లేరా?
Jabardasth : జబర్దస్త్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది.. ఇన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అంటే కారణం చమ్మక్ చంద్ర, సుడిగాలి సుదీర్, హైపర్ ఆది. ఈ ముగ్గురు జబర్దస్త్ అద్భుత జర్నీకి ప్రధాన కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. నూటికి నోరు శాతం ఆ ముగ్గురి వల్లే జబర్దస్త్ ఈ స్థాయిలో ఇప్పటి వరకు కొనసాగుతుంది. జబర్దస్త్ ప్రారంభించిన సమయంలో 10 నుండి 15 ఎపిసోడ్స్ మాత్రమే చేసి క్లోజ్ చేయాలి అనుకున్నారట. కానీ చమ్మక్ చంద్ర చేసిన ఒక్క స్కిట్ జబర్దస్త్ జర్నీ దశాబ్ద కాలం పూర్తి చేసుకునేలా చేసింది. చమ్మక్ చంద్ర జబర్దస్త్ ని జాతీయ స్థాయిలో నెంబర్ వన్ షో గా నిలబెట్టాడు. ఆయన దారిలో ఇతర టీం లీడర్స్ నవ్వించేందుకు ప్రయత్నించి అంతో ఇంతో వారు కూడా జబర్దస్త్ విజయంలో భాగస్వామ్యులు అయ్యారు. అందుకే జబర్దస్త్ మొదటి దేవుడు చమ్మక్ చంద్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు.
చమ్మక్ చంద్ర క్రేజ్ మెల్ల మెల్లగా తగ్గుతుంది అనుకున్న సమయంలో సుడిగాలి సుదీర్ లైన్ లో పడ్డాడు. సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను ఈ ముగ్గురు కలిసి చేసిన స్కిట్స్ మూడు నాలుగు సంవత్సరాల పాటు జబర్దస్త్ మళ్లీ టాప్ లో ఉండేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జబర్దస్త్ రెండవ దేవుడు సుడిగాలి సుదీర్ అని కూడా అంటూ ఉంటారు. సుడిగాలి సుదీర్ జోరు కొనసాగుతున్న సమయంలోనే అదిరే అభి టీం నుండి హైపర్ ఆది బయటికి వచ్చాడు. ఆది వేసే పంచ్ లు జబర్దస్త్ రేంజ్ ని మరింతగా పెంచాయి. అందువల్ల జబర్దస్త్ కి మూడవ దేవుడు హైపర్ ఆది. ఇప్పుడు చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో లేడు, ఇటీవలే సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోయాడు. ప్రస్తుతం హైపర్ ఆది మాత్రమే జబర్దస్త్ లో ఉన్నాడు.
హైపర్ ఆది కూడా మెల్ల మెల్లగా డౌన్ అవుతున్నాడు. ఎవరైనా.. ఎంతటి వాళ్ళైనా ఒక స్థాయి వరకే స్టార్ గా ఉంటారు ఆ తర్వాత తగ్గాల్సిందే.. తగ్గిపోవాల్సిందే. ఆ విషయం జబర్దస్త్ వారికి అర్థమవుతుందో లేదో తెలియడం లేదు, ఇప్పటి వరకు ఆది తర్వాత ఆ స్థాయిలో ఎవ్వరికీ అవకాశం ఇవ్వడం లేదు. అవకాశం ఇవ్వాలన్నా సరైన వాళ్ళు కనపడడం లేదట. జబర్దస్త్ కి నాలుగవ దేవుడు ఎవరు అంటూ ఇప్పుడు అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. హైపర్ ఆది కూడా జబర్దస్త్ ని వీడితే పరిస్థితి ఏంటి అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. ఒక చమ్మక్ చంద్ర, ఒక సుడిగాలి సుదీర్, ఒక హైపర్ ఆది వంటి మరో కమెడియన్ టీం లీడర్ వస్తే జబర్దస్త్ మరో నాలుగు ఐదు సంవత్సరాలు ముందుకు సాగుతుంది, లేదంటే దశాబ్ద కాలం తర్వాత జబర్దస్త్ కి తెరపడే అవకాశాలు లేకపోలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.