మున్సిపల్ విశ్లేషణః వైఎస్ జగన్ ను జనాలు ఇంతగా నమ్మడంకు కారణాలు రెండు
Ys Jagan : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా సాధించిన విజయం ను స్వయంగా ఆ పార్టీ నాయకులు కూడా నమ్మలేక పోతున్నారు. 99 శాతం మున్సిపాలిటీలను దక్కించుకోవడం అంటే మామూలు విజయం కాదు. ఒక్క టీడీపీ మాత్రమే కాకుండా జనసేన మరియు బీజేపీలు కూడా తీవ్రమైన పోటీ ఇస్తాయని అనుకున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ప్రచారంలో పాల్గొన్నలేదు.. కనీసం ప్రెస్ మీట్ లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయమని అడగలేదు. అయినా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనాలు నమ్మి ఓట్లు వేసి రికార్డు స్థాయి విజయాన్ని కట్టబెట్టారు.
Ys Jagan : జనాల్లో వ్యతిరేకత శూన్యం..
సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి కనీసం రెండు ఏళ్లు కూడా కాలేదు. కనుక ఇప్పటి నుండే ఆయన్ను జడ్జ్ చేయవద్దని ఓటర్లు భావించారు. ఆయన తన పనితనంను మెరుగు పర్చుకుంటాడని ఓటర్లు భావించినట్లుగా అనిపించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముందు ముందు ప్రతి ఒక్కరి ప్రయోజనార్థం పని చేస్తాడని జనాలు నమ్ముతున్నట్లుగా ఈ ఫలితాన్ని బట్టి అర్థం అయ్యింది. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొండి తనం పట్ల కూడా జనాలకు ఒక అవగాహణ ఉంది. కనుక మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు కాకుండా వేరే పార్టీకి ఓట్లే వస్తే ఖచ్చితంగా తమ మున్సిపాలిటీ అభివృద్దికి దూరం అవుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ మున్సిపాలిటీని పట్టించుకోక పోవచ్చు అనుకున్నారు.
Ys Jagan : రాజధానుల విషయం పట్టించుకోలేదు..
మున్సిపల్ ఎన్నికల్లో రాజధానుల విషయం ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా రాజధాని ప్రాంతంలో కూడా వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్బుత విజయాలను దక్కించుకున్నాడు. ఈ మొత్తం ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే జనాలు రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక వైకాపా అయితేనే ఈ మూడు ఏళ్ల పాటు మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వడం, అభివృద్ది చేయడం చేస్తుందని భావించి వారికే ఓట్లు వేసినట్లుగా చెబుతున్నారు. ఇక్కడ ఏపీ మున్సిపల్ ఓటర్లు చాలా తెలివిగా తీర్పు ఇచ్చారని అంటున్నారు.