సాగర్‌ టీఆర్ఎస్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కేసీఆర్‌ సూపర్‌ మైండ్ గేమ్‌.. నోముల కుటుంబంకు హ్యాండ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

సాగర్‌ టీఆర్ఎస్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కేసీఆర్‌ సూపర్‌ మైండ్ గేమ్‌.. నోముల కుటుంబంకు హ్యాండ్

 Authored By himanshi | The Telugu News | Updated on :5 March 2021,1:19 pm

Nagarjuna Sagar by Elections  : నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ మరియు బీజేపీ లు తమ అభ్యర్థలను ప్రకటించి ప్రచారంతో దూసుకు పోతున్నారు. ఇక అధికార టీఆర్‌ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున క్యాపెంయిన్‌ చేస్తున్న విషయం తెల్సిందే. టీఆర్‌ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని తెలియకుండానే ప్రచారంను జోరుగా చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ఏకరువు పెడుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ స్థానంలో నోముల నర్సింగయ్య గత ఎన్నికల్లో పోటీ చేసి జానారెడ్డిపై గెలిచాడు. ఇప్పుడు ఆయన తనయుడు కూడా ఆ స్థానంలో పోటీ చేసి గెలుపు సాధిస్తాను అనే నమ్మకంతో ఉన్నాడు. కాని పార్టీ అధినాయకత్వం మాత్రం నర్సింగయ్య తనయుడు నోముల భరత్‌ కు టికెట్‌ ను ఇచ్చేందుకు సిద్దంగా లేదు.

Nagarjuna Sagar by Elections  : జానారెడ్డిని దెబ్బ కొట్టేందుకు సామాజిక వర్గం గేమ్‌..

రెడ్డి సామాజిక వర్గంకు చెందిన జానా రెడ్డి పై పోటీగా బీసీ కి చెందిన నాయకుడిని రంగంలోకి దించడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని కేసీఆర్‌ రాజకీయ సన్నిహితులు సూచించినట్లుగా తెలుస్తోంది. దుబ్బక ఎన్నికల్లో సెంటిమెంట్ పేరుతో చనిపోయిన ఎమ్మెల్యే భార్యకు సీటు ఇస్తే అక్కడ పార్టీ పరువు పోయినంత పనైంది. ఆ ఒక్క ఓటమితో టీఆర్‌ఎస్ ఇంకా కూడా కుదుపుకు గురి అవుతూనే ఉంది. అందుకే ఈ సమయంలో ఆ సెంటిమెంట్‌ పేరుతో ఆ స్థానంను చేజార్చుకోవద్దు అనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే బీసీ సామాజిక వర్గంకు చెందిన కట్టబోయిన గురువయ్య యాదవ్‌ ను రంగంలోకి దించబోతున్నాడు.

Telangana CM KCR

Telangana CM KCR

Nagarjuna Sagar by Elections  : సర్వే ప్రకారం టికెట్‌..

సాగర్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. పదుల సంఖ్యలో నాయకులు ఆ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ముందుకు వచ్చారు. వచ్చిన వారందరిలోకి గ్రౌండ్‌ లెవల్ లో ఎక్కువ ప్రజాధరణ ఉన్న నాయకుడిగా గురువయ్య యాదవ్ పేరు సర్వేలో వచ్చినట్లుగా రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరేదైనా రాజకీయ సమీకరణలు మారితే తప్ప సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసేది గురువయ్య యాదవ్‌ మాత్రమే అంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది