Amla Peppar Rasam Recipes : చలికాలంలో చేసుకునే ఘాటైన హెల్దీ రసం.. వట్టి రసంతోనే అన్నం మొత్తం తినేస్తారు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Amla Peppar Rasam Recipes : చలికాలంలో చేసుకునే ఘాటైన హెల్దీ రసం.. వట్టి రసంతోనే అన్నం మొత్తం తినేస్తారు..

Amla Peppar Rasam Recipes : ఈరోజు ఎన్నో ఔషధ గుణాలను మన శరీరానికి అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచే రాసి ఉసిరికాయలతో మంచి టేస్టీ రసాన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను.. చాలా ఈజీగా చేసుకోవచ్చు.. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరి ఇక రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం.. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, పచ్చిమిర్చి, మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, […]

 Authored By jyothi | The Telugu News | Updated on :16 December 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Amla Peppar Rasam Recipes : చలికాలంలో చేసుకునే ఘాటైన హెల్దీ రసం..

  •  వట్టి రసంతోనే అన్నం మొత్తం తినేస్తారు..

Amla Peppar Rasam Recipes : ఈరోజు ఎన్నో ఔషధ గుణాలను మన శరీరానికి అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచే రాసి ఉసిరికాయలతో మంచి టేస్టీ రసాన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను.. చాలా ఈజీగా చేసుకోవచ్చు.. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరి ఇక రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం.. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, పచ్చిమిర్చి, మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం,ఆయిల్ మొదలైనవి…  తయారీ విధానం: ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం రెండు టీ స్పూన్ల దాకా మిరియాలు ఒక టీ స్పూన్ దాక జీలకర్ర అలాగే ఐదు ఆరు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకుని పెట్టుకోండి. నెక్స్ట్ అలాగే కొద్దిగా కందిపప్పుని మెత్తగా ఉడికించుకుని పల్చగా చేసుకొని పెట్టుకోవాలి. అది ఒక కప్పు దాకా తీసుకోవాలి. తర్వాత అరసానికి ఒక లీటర్ నీళ్లు తీసుకుని అందులో ఉసిరికాయలు దంచి వేసుకోవాలి. అలాగే ఒక స్పూను ఉప్పు, కొంచెం పసుపు, ఒక కప్పు టమాటా ముక్కలు, రెండు రెమ్మలు దాకా కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని వేసుకోండి.

తర్వాత మనం దంచుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లి పొడిని ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొద్దిగా కలుపుకోండి. కొద్దిగా మాష్ చేస్తే వాటర్లోకి రాసాలన్నీ కూడా చక్కగా దిగుతాయన్నమాట. నెక్స్ట్ ఈ గిన్నె ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి రసాన్ని బాగా మరిగించండి. రసం లెవెల్ అనేది మనం తీసుకున్న దానికన్నా కూడా కొంచెం తగ్గేంత వరకు రసాన్ని బాగా మరగ పెట్టుకోవాలి.. 15, 20 నిమిషాల పాటు రసం బాగా మరిగాక ఇందులో ఉండే ఉసిరికాయలు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇలా రసం బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్నా ఒక కప్పు దాకా పప్పుని వాటర్ తో సహా వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుము కూడా వేసుకోండి. ఈ రసంలోకి బెల్లం తురుము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని వేసేసి బాగా కలిపి సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మరిగించండి. తర్వాత ఇప్పుడు ఈ రసానికి తాళంపు పెట్టుకోవాలి.

తాలింపు పెట్టుకోవడం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ లో రెండు ఎండుమిర్చి, అర టీ స్పూన్ దాక ఆవాలు, అర టీ స్పూన్ దాక మెంతులు అలాగే కొద్దిగా ఇంగువ ఇవి వేసి కొంచెం తాలింపును వేయించేసి రసంలోకి వేసేసేయండి. కొత్తిమీరని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసి బాగా కలిపి పక్కకు దించుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి. చాలా సింపుల్ గా ఈజీగా ఈ ఆమ్లా రసాన్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది. మంచి హెల్తీ రసం కాబట్టి మీ అందరూ ఇంట్లో ఒకసారి ఈ రసాన్ని ట్రై చేసి టేస్ట్ చేయండి…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది