Ice Cream Recipe : ఐస్ క్రీమ్ ను ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ice Cream Recipe : ఐస్ క్రీమ్ ను ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి…!

 Authored By prabhas | The Telugu News | Updated on :25 October 2022,7:20 am

Ice Cream Recipe : ఐస్ క్రీమ్ ను ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లదాకా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్స్ ఇష్టపడతారు. అయితే ఐస్ క్రీమ్ తినాలంటే బయటికి వెళ్లి తింటుంటాం. అయితే బయటి ఐస్ క్రీమ్స్ ను ఎక్కువగా తినడం అంత మంచిది కాదు. అందుకే ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ను ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఐస్ క్రీమ్ ను పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసి పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) పాలు 2) పంచదార 3) పాలమీగడ 4) నెయ్యి 5) జీడిపప్పు 6) కస్టర్డ్ పౌడర్ 7) ఫుడ్ కలర్ 8) బటర్ ఎసెన్షన్

తయారీ విధానం : ముందుగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్లో అర లీటర్ పాలు తీసుకొని ఒక పొంగు వచ్చేవరకు కాగ పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసి అర లీటర్ పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ కలిపి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగుతున్న పాలలో పావు కప్పు పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార కరిగాక ఐదు నిమిషాల తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు ఉడికించుకోని బట్టర్ స్కాచ్ ఎసెన్షన్ వేసుకొని చిక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

How to make Ice Cream Recipe easily at home

How to make Ice Cream Recipe easily at home

ఇప్పుడు ఒక పాన్ లో పావు కప్పు పంచదార వేసి కరిగాక హాఫ్ టీ స్పూన్ వెన్న కానీ నెయ్యి కానీ వేసుకుని బాగా కరిగించుకొని క్యారమిల్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఇందులో పావు కప్పులో సగం జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే నెయ్యి పూసిన ప్లేట్ లో వేసి స్ప్రెడ్ చేయాలి. వీటిని ఒక కవర్లో వేసి ఒక కర్రతో కొడితే బటర్ స్కాచ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కస్టర్డ్ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి ఒక కప్పు పాల మీగడ వేసి మిక్సీ పట్టుకోని ఒక బాక్స్ లో వేసి గంటపాటు ఉంచాలి. తర్వాత దీనిని మిక్సీ జార్ లో వేసుకుని మనం తయారు చేసుకున్న బటర్ స్కాచ్ ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. మళ్లీ దీన్ని బాక్సుల వేసి బటర్ స్కాచ్ మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోని బటర్ పేపర్ పెట్టుకొని మూత పెట్టి డీప్ ఫ్రిజ్లో పెట్టాలి. నెక్స్ట్ డే తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది