Ragi Halwa Recipe : రాగి పిండితో హెల్దిగా నోట్లో ఇట్టే కరిగిపోయే ఈ హల్వా ఒక్కసారి చేసి చూడండి. ఎవరైనా వంక పెట్టకుండా తినేస్తారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ragi Halwa Recipe : రాగి పిండితో హెల్దిగా నోట్లో ఇట్టే కరిగిపోయే ఈ హల్వా ఒక్కసారి చేసి చూడండి. ఎవరైనా వంక పెట్టకుండా తినేస్తారు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2023,7:40 am

Ragi Halwa Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి నార్మల్గా హల్వా అంటే రాగులతో చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా రాగి పిండి హల్వా చేసి చూడండి నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావలసిన పదార్థాలు : రాగి పిండి, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఈ రాగి పిండి హల్వా కోసం ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను. తర్వాత ఈ రాగి పిండిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇక ఇందులోని ఓ రెండు కప్పులు దాకా నీళ్లు పోసుకుంటున్నాను. ఒక కప్పు రాగి పిండి అయితే ఒకటిన్నర కప్పు లేదా రెండు కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. ఇలా రెండు కప్పులు నీళ్లు పోసుకుని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి.

ఒక రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి పిండి అంతా బాగా నానేంతవరకు నానబెట్టుకోవాలి. ఇలా పిండి బాగా నానిన తర్వాత ఒక గిన్నెకి ఇలా క్లాత్ కట్టుకొని ఈ క్లాత్ మీద గ్రైండ్ చేసుకున్న ఈ రాగి పిండిని మొత్తాన్ని వేసుకోండి. ఇలా రాగి పిండిని మొత్తాన్ని ఈ క్లాత్ మీద వేసుకొని వడకట్టుకోవాలి. ఈ రాగి పిండిలోని పాలు వరకు కిందికి గిన్నెలోకి దిగిపోతాయి. పిండంతా పైనే ఉండిపోతుంది. గ్రైండ్ చేసుకుని బాగా మెత్తగా ఇలా ఈ పాలన్నీ గిన్నెలోకి వెళ్లిపోయి ఇలా చిక్కగా రాగి పిండి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా పిండేసుకున్నారంటే చక్కగా పాలన్నీ గిన్నెలోకి వచ్చేస్తాయి. మీరు పల్చటి క్లాత్ తీసుకోండి కోసం మందంగా ఉన్న క్లాత్ తీసుకున్నారంటే మీకు రాగి పిండి పాలు సెపరేట్ అవ్వను చూశారు కదా ఇలా రాగి పిండిని పాలలాగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను.

How to make Ragi Halwa Recipe in Telugu

How to make Ragi Halwa Recipe in Telugu

ఈ బెల్లం 2 కప్పులు నీళ్లు పోసుకుని బెల్లం మొత్తం కరిగేంతవరకు కలుపుతూ కరిగించుకోండి. ఒక అర కప్పు నీళ్లు సరిపోతాయండి ఎక్కువ వేశారంటే మీకు త్వరగా హల్వా అనేది ప్రిపేర్ అవదు కొంచెం టైం తీసుకుంటుంది సో ఇలా బెల్లం మొత్తం కరిగేంతవరకు ఈ బెల్లం వాటర్ మరల ఒక మరుగు వచ్చేంతవరకు మరిగించుకోవాలి. మనకి పాకం ఏమీ రానక్కర్లేదు జస్ట్ ఒక మరుగు వస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో ముందుగా మనం రాగి పిండితో పాలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పాలను మొత్తాన్ని ఈ బెల్లం వాటర్ లో వేసుకోవాలి. ఇలా రాగి పిండి పాలను మొత్తాన్ని చిక్కబడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. హల్వా లాగా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. మొదట ఇలా గంజి లాగా ఉంటుంది. తర్వాత మరి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా మెల్లమెల్లగా హల్వా అంతా దగ్గరికి వచ్చేసి కొంచెం థిక్ గా రెడీ అవుతుంది.

అప్పటివరకు ఇలా కలుపుతూనే ఉడికించుకొని అండ్ స్టవ్ ని మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మెల్లగా ఈ హల్వా అంతా బాగా ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది ఇలా హల్వా మొత్తం బాగా దగ్గరకొచ్చేసిన తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక వన్ స్పూన్ దాకా యాలుకల పొడి వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి . తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా హల్వాలో బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉడికించుకుంటున్నాను. చివరికి మనకి హల్వా అంతా పాన్కి అతుక్కోకుండా విడివిడిగా సపరేట్ అవుతూ రావాలి ఇలా వచ్చిన తర్వాత మూడు స్పూన్ల నెయ్యిని వేసి బాగా దగ్గరగా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి అలా దగ్గరగా అయిన తర్వాత దీనిని తీసి ఒక గిన్నెలో నెయ్యిని రాసి ఇదంతా దాంట్లో వేసి మంచిగా స్ప్రెడ్ చేసి ఒక గంట పాటు పక్కన ఉంచుకోవాలి. అంతే గంట తర్వాత దానిని తీసి ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చు. అంతే రాగి పిండితో హల్వా రెడీ.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది