Chintha Chiguru Mutton : పుల్ల పుల్లని చింతచిగురు మటన్..
Chintha Chiguru Mutton : ఈరోజు రెసిపీ వచ్చేసి చింతచిగురు మటన్. ఇది పుల్ల పుల్లగా ఎంతో బాగుంటుంది. ఎక్కువగా మనం గోంగూర మటన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వెరైటీగా చింతచిగురు మటన్ మనం తయారు చేసుకోబోతున్నాం దిన్ టెస్ట్ చాలా బాగుంటుంది. ఈ చింతచిగురు మటన్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…
Chintha Chiguru Mutton : దీనికి కావాల్సిన పదార్థాలు
చింతచిగురు, మటన్, కారం, చింతపండు రసం, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్, ఉప్పు మొదలైనవి…
Chintha Chiguru Mutton : దీని తయారీ విధానం
ముందుగా పావు కిలో చింతచిగురు తీసుకుని దాన్ని శుభ్రం చేసుకొని చేతిలో కొంచెం కొంచెంగా వేసి నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. దానిలో ఒక ఆఫ్ టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత పావు కప్పు ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం మెంతికూర కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఐదారు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మటన్ గిన్నెకి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. మళ్లీ మూత పెట్టి మటన్ లో నీరంతా ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మల్లొకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా నలిపి పెట్టుకున్న చింతచిగురుని వేసుకోవాలి. చింతచిగురు వేసి బాగా కలుపుకోవాలి. మళ్లీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఉప్పుకారాలను చూసుకొని కావలసిన వాళ్లు వేసుకోవచ్చు. తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి కిందికి పైకి బాగా కలిపి పి ఇక స్టవ్ ఆపుకోవడమే కొంచెం కొత్తిమీర కూడా వేసి వేరే బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా చింతచిగురు మటన్ రెడీ.