Munagaku Chili Powder Recipe : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి వందల వ్యాధులను దూరం చేసే కమ్మని కారం పొడి…!!
ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు కారంపొడి. ఈ పొడి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఈ పొడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ పొడిని తినడం వలన వందల వ్యాధులను మన దరిచేరకుండా చేసుకోవచ్చు.. ఈ మునగాకు కారంపొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం.. దీనికి కావాల్సిన పదార్థాలు : మునగాకు, ఉప్పు, పసుపు ,పచ్చశనగపప్పు, శనగలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆయిల్ మొదలైనవి.. తయారీ విధానం : ముందుగా మునగాకు తెచ్చుకొని దానిని శుభ్రంగా కట్ చేసి ఆకుల్ని తెంపుకొని మళ్లీ కడిగి వాటిని ఒక క్లాత్ పై ఫ్యాన్ కింద ఆరబెట్టు పెట్టుకోవాలి. ఆకులన్నీ కూడా పొడిపొడిగా రావాలి. అప్పటివరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి.
తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టి దానిలో కొన్ని పల్లీలు వేసి వేయించిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దానిలో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు, వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఎండు మిరపకాయలు ఒక 10 తీసుకుని దాంట్లో వేసి వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇక వాటిని కూడా తీసి పక్కన పెట్టుకొని అదే పాన్ లో కొంచెం చింతపండు ఒక నిమిషం పాటు వేపుకుని తీసుకోవాలి.
మళ్లీ అదే పాన్ లోకి ఒక టు స్పూన్లో ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు వేయించికొని దానిలోని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని వేసి స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని చక్కగా కరివేపాకు లాగా వేయించుకోవాలి. ఇక ఈ ఆకాంత క్రిస్పీగా అయ్యేవరకు వేయించుకొని తీసుకోవాలి. ఈ ఆకు బాగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన పప్పులు అలాగే చింతపండు మిరపకాయలు మిక్సీ జార్లో వేసి దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ పొడిల చేసుకోవాలి. తర్వాత దానిలో ఒక పది పదకొండు వెల్లుల్లిని తర్వాత ముందుగా ఫ్రై చేసిన మునగాకు కూడా వేసి మరొకసారి పౌడర్ చేసుకోవాలి. అంతే మునగాఆకు పొడి రెడీ అయింది. ఇది ఆరోగ్యానికి మనకి ఎంతో మేలు చేసింది కాబట్టి అందరూ ట్రై చేసి చూడండి..