Sankranti Natu Kodi Pulusu Recipe : సంక్రాంతికి ఇంట్లో నాటుకోడి పులుసు అదిరిపోవాలంటే ఇలా ట్రై చేయండి…!
ప్రధానాంశాలు:
Sankranti Natu Kodi Pulusu Recipe : సంక్రాంతికి ఇంట్లో నాటుకోడి పులుసు అదిరిపోవాలంటే ఇలా ట్రై చేయండి...!
Sankranti Natu Kodi Pulusu Recipe : ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం.. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. పిల్లలు కూడా ఈజీగా చేసేయొచ్చు.. సంక్రాంతికి ఎక్కువగా ఊర్లలో నాటుకోడి పులుసు చేసుకుంటూ ఉంటారు కదండీ. పండగ వచ్చేసింది కాబట్టి మీరు కూడా చూసేసి చక్కగా ఇంట్లో ట్రై చేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి చికెన్, ఉల్లిపాయలు, టమాట, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఆయిల్, పసుపు, గరం మసాలా, కొత్తిమీర మొదలైనవి.తయారీ విధానం: ఈ నాటు కోడి పులుసు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ కేజీ దాకా నాటుకోడి మొక్కలు మీడియం సైజులో తీసుకోవాలి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, ఉప్పు, ఆయిల్ దాకా వేసి ఈ ముక్కలన్నిటికీ కూడా వీటిని బాగా పట్టించి ఒక పక్కన పెట్టుకోండి.. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యాని ఆకులు, ఒక ఇంచ్ దాల్చిన చెక్క, నాలుగు లవంగ మొగ్గలు, రెండు యాలక్కాయలు, ఒక అనాసపువ్వు వేయాలి. ఆ తర్వాత ఒక కప్పు నిండుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు వేగేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి.ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, నూనె అప్లై చేసుకున్న చికెన్ ముక్కలు అన్నిటిని కూడా వేసేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ లేకుండా ఈ చికెన్ ముక్కల నుంచి వాటర్ వచ్చి చికెన్ ఒక 50% ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ ని కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 50% పాటు బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం కారం వేసుకోవాలి. అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి.వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాట మెత్తగా మగ్గేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు అనేవి సాఫ్ట్ గా మగ్గిపోయి మంచిగా గ్రేవీలా తయారైన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా నీళ్లు పోసేసి తర్వాత అంతా కలిపేసుకుని మూత పెట్టేసి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి.
చికెన్ ముక్కలనేవి సాఫ్ట్ గా ఉడికిపోవాలండి. అంతవరకు కూడా విజిల్స్ పెట్టుకుని ఉడికించుకోవాలి. ప్రెషర్ అంత పోయిన తర్వాత మీరు మూత తీసేస్తే 6 విజిల్స్ కి చికెన్ పెట్టుకుని ఇంకొక టు విసిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి. మొత్తానికైతే చికెన్ ముక్క అనేది ఇలా సాఫ్ట్ గా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ ని అలాగే సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి అంతా కూడా కలుపుకొని ఈ చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ గరం మసాల పౌడర్ని ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుని అంత కూడా కలిపేసుకుని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంతవరకు లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. అంతేనండి నాటుకోడి పులుసు అయితే ఈజీ ప్రాసెస్ లో చాలా టేస్టీగా చక్కగా తయారు చేసేసుకున్నాం కదా ఈవెన్ చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు.. ఇలా ఒకసారి నాటుకోడి పులుసుని ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిల్లు గారెల్లోకైనా లేదా బకార రైస్ లోకి అయినా రైస్ లోకి అయినా చపాతీలోకైనా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి.. డెఫినెట్ గా ట్రై చేయండి.