Guntoor.. ‘పొలంబాట’లో ఎమ్మెల్యే.. రైతులతో సమావేశం

Authored By praveen T | The Telugu News | Updated on: September 4, 2021, 4:19 pm

గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ‘పొలంబాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని కొల్లిపర గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ క్రమంలోనే రైతులతో ఎమ్మెల్యే శివకుమార్ స్వయంగా సమావేశమయ్యారు. వ్యవసాయం ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు.

ఎటువంటి పంటలు పండిస్తున్నారు., ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది అని తదితర విషయాలు రైతుల నుంచి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. కొల్లిపర గ్రామంలోని పసుపు పంట, పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. పసుపు పంట దిగుబడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెంట స్థానిక వైసీపీ నేతలు, అధికారులు ఉన్నారు. ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో పర్యటించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొల్లిపర గ్రామ రైతాంగం తమ సమస్యల గురించి ఎమ్మెల్యేకు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రైతులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం తమ ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు.

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp