Acidity : మాత్రలు లేకుండా ఐదు నిమిషాలలో ఎసిడిటీ మటుమాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Acidity : మాత్రలు లేకుండా ఐదు నిమిషాలలో ఎసిడిటీ మటుమాయం…!

 Authored By aruna | The Telugu News | Updated on :11 July 2023,8:00 am

Acidity : ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా తిందామంటే కడుపులో ఇబ్బందిగా ఉందా.. కడుపు మండినట్టుగా అనిపిస్తోందా? కొంచెం తింటేనే కడుపు నిండిపోతోందా.. అది కాకుండా తిన్నది సరిగా అరగడం లేదా.. వీటన్నిటికీ కారణం యాసిడిటీ పెరిగిపోవడం.. మనం తిన్న ఆహారం అరగడానికి మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా ముఖ్యం. అది మోతాదుకు మించి పెరిగిపోవడం వల్ల ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. మనం రోగాల బారిన పడడానికి ప్రథమ కారణంగా జీర్ణ సమస్యలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిన్న ఆహారం సరిగా అరగక అలా పొట్టలో నిలవ ఉండి పోవడం వల్ల రకరకాల ఆసిడ్లు ఫామ్ అవ్వడం.. అలాగే చెత్తంతా కడుపులో ఉండిపోవడం రక్తనాళాల్లో కూడా వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం, రక్తనాళాలు మూసుకుపోవడం, అజీర్తి సమస్యలు గ్యాస్ యాసిడిటీ ఇలా ఒకటి కాదు చాలా రకాల సమస్యలు కేవలం జీవన వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే జరుగుతాయి..

ఫెసిలిటీ లక్షణాలు ఎలా ఉంటాయి? వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే మన ఆహారపు అలవాట్లలో ఏమేమి మార్చుకోవాలి అనే విషయాలు పూర్తిగా చూద్దాం..మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రం హోం లేదా ఎక్కువ పని గంటలు కూర్చుని పని చేయడం వల్ల సమయాన్ని సరిగా పాటించలేక చాలా రకాల రోగాల బారిన పడుతున్నట్లుగా కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు.. చాలామంది అందువల్ల విశ్రాంతి లేని జీవితాన్ని ఎందరో గడుపుతున్నారని చెప్పొచ్చు.. అసలు యాసిడిటీ రావడానికి కారణం ఏంటి అనే విషయాలు చూస్తే కనుక ఈ అసిడిటీ సమస్య రావడానికి ముఖ్యంగా వేల కాని వేళ భోజనం చేయడం తగినంత నీరు తాగకపోవడం, ఆల్కహాల్, ధూమపానం, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం.. కారం ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం జంక్ ఫుడ్స్ కి అలవాటు పడడం ఇలాంటివన్నీ కూడా చేస్తే మన కడుపులో ఎసిడిటీ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇటువంటి ఆహార పదార్థాలు అరగడానికి చాలా సమయం పడుతుంది.

అయితే తిన్న ఆహారం పూర్తిగా అరగకుండానే మళ్ళీ వెంటనే తినడం దాంతో ముందు తిన్న పదార్థాలు ఇప్పుడు తిన్న పదార్థాలు కలిసి కడుపులో పులుసు పోవడం వల్ల రకరకాల ఇబ్బందులు అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. కడుపు ను ఇబ్బంది పెట్టే ఆమ్లాన్ని పొట్ట ఉత్పత్తి చేసి కారణమవుతుంది. చూశారా ఎన్ని రకాల కారణాల వల్ల మనం అసిడిటీకి గురవుతుంటాం. మరి యాసిడిటీ గురవకుండా ఉండడానికి తీసుకోవలసిన ఆహార పదార్థాలు కూడా మనం కచ్చితంగా తెలుసుకోవాలి.. అవి టమాటో అని క్యాలీఫ్లవర్ ఇటువంటివి అరగడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి తీసుకోవడం మంచిది. అలాగే ఆయిల్ ఏది పడితే అది ఎలా పడితే అలా వాడకుండా ఒక మంచి బ్రాండ్ మీరు ఆయిల్ వాడాలి. నువ్వుల నూనె వాడటం చాలా మంచిది.. ఈ ఆయిల్ డైజెస్టివ్ ట్రాక్ లో దాదాపు 400 రకాల మంచి బాక్టీరియా ఉంటాయి.

Acidity fades in five minutes without pills

Acidity fades in five minutes without pills

ఇది మనం తిన్న ఆహారాన్ని చక్కగా జీర్ణం చేయడం మాత్రమే కాకుండా ఇమ్యూనిటీ లెవెల్స్ ని కూడా పెంచుతాయి. మంచి బాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. దీనివల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దీంతో అసిడిటీ సమస్య దూరం అవుతుంది. అయితే వీటిలో కూడా మనం పెరుగుని యధావిధిగా తీసుకోవడం గాని పులియపెట్టిన ప్రతి దాన్ని పొట్టలో వేసుకోవడం వంటివి చేయకూడదు. మీరు మజ్జిగ తాగాలి అనుకుంటే చాలా పల్చగా చేసుకుని అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండేలా చూసుకుని తీసుకోవడం మంచిది. అలాగే బార్లీ నీళ్లు తరచుగా తీసుకుంటూ ఉండండి. ఇక ప్రతిరోజు సరిపడా నీటిని తాగడం మర్చిపోవద్దు. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎసిడిటీ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది